Taraka Ratna : సుమారుగా 23 రోజులపాటు ప్రాణాలతో పోరాడి నందమూరి తారకరత్న నేడు కన్నుమూసిన ఘటన యావత్తు సినీ లోకాన్ని మరియు నందమూరి అభిమానులను శోక సంద్రం లోకి నెట్టేసింది.జనవరి 27 వ తారీఖున టీడీపీ పార్టీ ఎన్నికల ప్రచారం కోసం నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభోత్సవం లో కుప్పం లో పాల్గొన్న తారకరత్న అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కుప్పకూలిపోగా వెంటనే ఆయనని సమీపం లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరు లోని ‘నారాయణ హృదయాలయ’ కి తరలించి విదేశాల నుండి వైద్యులను రప్పించి చికిత్స అందించారు.కానీ ఎన్ని చేసినా ప్రయోజనం లేకపోయింది.నేడు సాయంత్రమే ఆయన కన్నుమూశారు.ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులందరు హాస్పిటల్ కి చేరుకోగా, రేపు తారకరత్న స్వగృహానికి తరలించబోతున్నారు.ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు తారకరత్న అంత్యక్రియ కార్యక్రమాలు జరగనున్నాయి.
ఆరోజు ‘యువ గళం’ కార్యక్రమానికి తారకరత్న రాకపొయ్యుంటే ఈరోజు ఆయన మన మధ్యనే ఉండేవారా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.అభిమానుల తాకిడి తట్టుకోలేక, ఊపిరి ఆడక , శరీరం మొత్తం డీహైడ్రేట్ అయ్యి గుండెపోటు వచ్చిందని ఇది వరకే డాక్టర్లు తెలిపారు.ఆరోజు ఆయన ఎదో ఒక కారణం చేత కుప్పం కి వెళ్లకుండా ఆగిపొయ్యుంటే నేడు తారకరత్నకి ఆయన కుటుంబానికి మరియు నందమూరి కుటుంబ సభ్యులకి ఇంత శోకం ఉండేది కాదని అంటున్నారు.
చంద్ర బాబు – లోకేష్ తో కలవడం అంత మంచిది కాదని,వాళ్ళు ఐరన్ లెగ్ లాంటి వాళ్ళని ప్రతిపక్ష పార్టీలు చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఈరోజు నిజమేనేమో అనిపిస్తుంది.రాజకీయం గా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తారకరత్న కళలు కంటూ కొద్దీ నెలల క్రితమే తెలుగు దేశం పార్టీ లో చేరాడు.ఆయన తీసుకున్న ఆ నిర్ణయం ఈరోజు ఆయన ప్రాణాలను తీసిందంటూ నందమూరి అభిమానులు వాపోతున్నారు.