
Prabhas Project K : టాలీవుడ్ నుండి నేటి తరం హీరోలలో మొట్టమొదటి పాన్ ఇండియన్ స్టార్ ఎవరు అంటే కళ్ళు మూసుకొని అందరూ చెప్పే పేరు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.బాహుబలి సిరీస్ తో ఆయనకీ వచ్చినటువంటి పాన్ ఇండియన్ క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ మరో స్టార్ హీరో కి రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అలాంటి ఇమేజి వచ్చిన తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా బోల్తా కోట్టాయో మన అందరికీ తెలిసిందే.
సాహూ సినిమా కొన్ని ప్రాంతాలలో పర్వాలేదు అనే రేంజ్ లో ఆడినప్పటికీ,’రాధే శ్యామ్’ సినిమా మాత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది.అయితే ప్రభాస్ ఫ్యాన్స్ భవిష్యత్తులో తమ హీరో చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ని చూసి బౌన్స్ బ్యాక్ చాలా తేలికగా అవుతాడు, భయపడాల్సిన అవసరం లేదని సోషల్ మీడియా లో ధైర్యం చెప్పుకునేవాళ్ళు.
కానీ రీసెంట్ గా ఆ సినిమాల నుండి వస్తున్నా కంటెంట్ చూసి అభిమానులు భయపడిపోతున్నారు.ముఖ్యంగా ‘ఆది పురుష్’ టీజర్ ఎలాంటి ట్రోల్ల్స్ కి గురైందో మన అందరం చూసాము.వందల కోట్లు ఖర్చుపెట్టి కార్టూన్ ప్రభాస్ లాంటి స్టార్ తో కార్టూన్ సినిమాలు తీస్తారా అని అభిమానుల చేత చివాట్లు పెట్టించుకుంది మూవీ టీం.దీనితో సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమాని జులై కి వాయిదా వేసి, గ్రాఫిక్స్ పై రీ వర్క్ చేస్తున్నారు.ఇక ప్రభాస్ చేతిలో ఉన్న మరో క్రేజీ మూవీ ‘ప్రాజెక్ట్ K’ మీద మొదటి నుండి అభిమానుల్లో భారీ అంచనాలు ఉండేవి.కానీ ఈరోజు విడుదల చేసిన ఆ సినిమా పోస్టర్ ని చూసి భయపడిపోతున్నారు ఫ్యాన్స్.
2024 వ సంవత్సరం లో జనవరి 12 న ఈ సినిమాని విడుదల చెయ్యబోతున్నాము అంటూ నేడు ఒక కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసారు.ఈ పోస్టర్ ని చూస్తే ఎదో వీడియో గేమ్ కోసం చేసినట్టు అనిపించి అభిమానులు కాస్త నిరాశకి గురయ్యారు.ఇలా ప్రభాస్ తో వందల కోట్ల రూపాయిలు సినిమాలు తీస్తున్నామని ఫ్యాన్స్ ని మోసం చేస్తున్నారా..ఆ క్వాలిటీ ఏంటి అంటూ సోషల్ మీడియా లో అభిమానులు విరుచుకుపడుతున్నారు.