Minister Roja- Brahmaji: రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ కి రోజురోజుకి జనాల్లో ఆదరణ పెరిగిపోతుంది..2019 ఎన్నికల సమయం లో జనసేన పార్టీ కి ఎంత బలం ఉందో, దానికి పది రెట్లు బలం సంపాదించుకుంది జనసేన పార్టీ..జనాల్లో వస్తున్న ఆదరణ చూసి ఇప్పుడు సినీ సెలెబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్టుగా నిలబడడానికి ముందుకొచ్చారు.

కమెడియన్ పృథ్వి గతం లో వైసీపీ పార్టీ లో చేరి ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లోకి వచ్చిన సంగతి తెలిసిందే..ఇక లేటెస్ట్ గా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా మొన్న జరిగిన జనసేన ‘యువశక్తి’ సభకి వచ్చి పవన్ కళ్యాణ్ కి సపోర్టుగా, వైసీపీ పార్టీ ని ఏకిపారేసిన సంగతి తెలిసిందే..హైపర్ ఆది చేసిన ఆ కామెంట్స్ రాజకీయాల్లో పెను దుమారమే రేపింది..దీనిపై మంత్రి రోజా కూడా స్పందించడం మనం చూసాము.
ఆమె మాట్లాడుతూ ‘హైపర్ ఆది లాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు..వాళ్ళేదో చిన్న చిన్న షోస్ చేసుకుంటూ, అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ఉంటారు..మెగా ఫ్యామిలీ లో 7 మంది హీరోలున్నారు..వాళ్లకి గురించి ఏమైనా నెగటివ్ గా మాట్లాడితే సినిమాల్లో ఎక్కడ అవకాశాలు రావో అని భయపడతారు..అది కేవలం భయం తో చేస్తున్న సపోర్టు కానీ..ప్రేమతో చేస్తున్న సపోర్ట్ కాదు’ అంటూ సమాధానం ఇచ్చింది..ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవ్వగా దీనిపై సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనదైన స్టైల్ లో రోజా కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామలీ క్యాంపైన్ చెయ్యమని కానీ పార్టీ లో చేరమని కానీ అడగలేదు చిన్న ఆర్టిస్ట్ లే కదా .. అంత బయపడతారెందుకు’ అంటూ పెట్టిన ఒక ట్వీట్ సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది..ఒకప్పుడు అధికారపార్టీ పై గొంతెత్తి మాట్లాడడానికి భయపడే సినిమా ఆర్టిస్టులు ఇప్పుడు వరుసగా వైసీపీ పార్టీ పై విరుచుపడుతున్నారు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ ఈసారి పవన్ కళ్యాణ్ కి ఉంటుందని సమాచారం.