Mirapakay Re Release: ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ ఏ రేంజ్ జోష్ లో ఉన్న ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..గత ఏడాది చివర్లో ధమాకా మూవీ తో 100 కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరిన రవితేజ, ఆ తర్వాత వెంటనే మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకొని మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

క్రాక్ తర్వాత వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడిన రవితేజ ఇప్పుడు బ్యాక్ 2 బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడం తో ఆయన అభిమానుల్లో మామూలు జోష్ రాలేదు..సంబరాలు చేసుకుంటున్నారు..రవితేజ కి ప్రస్తుతం ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి కొంతమంది థర్డ్ పార్టీ కి సంబంధించిన వాళ్ళు జనవరి 26 వ తేదీన రవితేజ పుట్టినరోజు ని పురస్కరించుకొని ఆయన కెరీర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘మిరపకాయ్’ సినిమాని రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.
ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ రెండవ సినిమా ఇది..ఈ సినిమా అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో హరీష్ శంకర్ తలరాతే మారిపోయింది..ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమా తీసి ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడో మన అందరికీ తెలిసిందే.

ఇప్పుడు అలాంటి సినిమా రీ రిలీజ్ అవ్వబోతుండడం తో మార్కెట్ లో ఈ సినిమాకి మామూలు క్రేజ్ ఏర్పడలేదు..డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా వరల్డ్ వైడ్ రైట్స్ ని కోటి రూపాయలకు థర్డ్ పార్టీ నుండి కొనుగోలు చేసినట్టు సమాచారం..రవితేజ వరుస సక్సెస్ లతో మంచి ఊపు మీద ఉండడంతో మొదటి రెండు రోజుల్లోనే పెట్టిన డబ్బులు వచ్చేస్తుంది అనే నమ్మకం తో ఉన్నారు బయ్యర్స్..చూడాలిమరి ఈ రీ రిలీజ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతమేరకు వర్కౌట్ అవుతుంది అనేది.