Sankranti Movies 2023 Collections: మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈమధ్య కాలంలో గోల్డెన్ పీరియడ్ ఏమిటీ అంటే 2020వ సంవత్సరం సంక్రాంతి అని చెప్పొచ్చు..ఆ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ , సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.. కేవలం ఆ ఒక్క సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రెండు సినిమాలకు కలిపి 600 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

మళ్ళీ అలాంటి సంక్రాంతి ఇప్పట్లో రాదేమో అని అనుకుంటున్న ట్రేడ్ కి ఈ సంక్రాంతి మరోసారి కాసుల కనకవర్షం కురిపించింది..మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మరియు నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ సినిమాలు విడుదలై మంచి వసూళ్లను రాబట్టాయి.. కలెక్షన్స్ పరంగా ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం చరిత్ర తిరగరాస్తూ రెండు వందల కోట్ల రూపాయిలు గ్రాస్ ని వసూలు చేసింది.
అలాగే మిక్స్డ్ టాక్ తో ఉన్న వీరసింహా రెడ్డి చిత్రానికి కూడా ఇప్పటికి వరకు 125 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి.. అలా ఈ రెండు సినిమాలకు కలిపి 325 కోట్ల రూపాయిల వసూళ్లు కేవలం సంక్రాంతి సెలవుల్లో వచ్చాయి..వీటి రన్ ఇంకా పూర్తి కాలేదు..మన టాలీవుడ్ లాగానే కోలీవుడ్ లో కూడా విజయ్ మరియు అజిత్ వంటి స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డాయి.

విజయ్ ‘వారిసు’ చిత్రానికి 180 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా, అజిత్ ‘తూనీవు’ చిత్రానికి 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఈ రెండు సినిమాలకు కలిపి కేవలం సంక్రాంతి సెలవుల్లో 330 కోట్ల రూపాయిలు వచ్చాయి..అలా సౌత్ ఇండియా లో టాలీవుడ్ మరియు కోలీవుడ్ కలిపి 600 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం..2020 తర్వాత ఇండస్ట్రీ కి ఇదే బెస్ట్ సంక్రాంతి అంటూ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు