https://oktelugu.com/

ABN RK kothapaluku : విజయసాయిరెడ్డిపై బూతులు.. వేమూరి రాధాకృష్ణ ఇంతలా ఎందుకు రెచ్చిపోయాడు?

తెలుగు నాట ఎందరో పాత్రికేయులు ఉండవచ్చు.. మరి ఎంతోమంది ప్రైమ్ టైం డిబేటర్లు ఉండవచ్చు. కానీ రాధాకృష్ణ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఎందుకంటే అతడి రాతల్లో, మాటల్లో ఉండే బ్యూటీ అది. కొన్నిసార్లు లైన్ తప్పుతుంది. ఇంకొన్నిసార్లు ప్యూర్ ఎల్లో కలర్ దట్టించుకుంటుంది. మరి కొన్నిసార్లు చర్నాకోల్ పట్టుకుంటుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 17, 2024 / 03:10 PM IST

    ABN RK Vijayasai reddy

    Follow us on

    ABN RK kothapaluku : ప్రతి ఆదివారం తన పత్రికలో కొత్త పలుకు పేరుతో రాధాకృష్ణ కొన్ని కొన్ని విషయాలను రాస్తుంటారు. అయితే అందులో ఈ విషయాన్ని కూడా కడుపులో దాచుకోలేరు. తను ఏం చెప్పాలనుకుంటున్నారో.. అదే విషయాన్ని కుండబద్దలు కొట్టేస్తారు. తాజా కొత్త పలుకులో మాజీ ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్మోహన్ రెడ్డిని లెఫ్ట్ రైట్ తీసుకున్నారు. లెఫ్ట్ పార్టీలను కడిగిపారేశారు. రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు ను, పవన్ కళ్యాణ్ ను కాపాడే ప్రయత్నం చేశారు.”వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. అహంకారాన్ని నింపుకున్నారు. ఇప్పుడు అధికారం పోయేవరకు హాహాకారం చేస్తున్నారు.. ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడొద్దు. వ్యవస్థల ధ్వంసం గురించి మీరు చెప్పొద్దు. మీ హయాంలో ఎంతటి దారుణాలు జరిగాయో తెలుసా. నాడు మీకు పచ్చగా కనిపించింది. అధికారం కోల్పోయేసరికి మొత్తం దారుణం కనిపిస్తోంది.. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రులు ఏర్పాటు చేసుకొని విధంగా కేసీఆర్, జగన్ మీడియా వ్యవస్థలను నెలకొల్పారు. వాటి వల్ల మీడియా మొత్తం సర్వనాశనం అయిందని” రాధాకృష్ణ రాసుకొచ్చారు. అంతేకాదు కేసీఆర్, జగన్ పరిపాలన కాలంలో జరిగిన దారుణాలను ఏ కరువు పెట్టారు. సహజంగా ఇలాంటి రాతలు రాయాలంటే కాస్త గుండె ధైర్యం కావాలి. రాధాకృష్ణ మొండిఘటం కాబట్టి ఎటువంటి భయాన్ని, ఆశ్రిత పక్షపాతాన్ని చూపించలేదు. అంతేకాదు త్వరలో కేటీఆర్ అరెస్ట్ కూడా జరుగుతుందంటూ హింట్ కూడా ఇచ్చారు. కవిత అరెస్టు వల్ల మైలేజ్ పెరగలేదని.. కనీసం జనాల్లో సానుభూతి కూడా రాలేదని స్పష్టం చేశారు . అయితే ఇలాంటి రాతలు రాధాకృష్ణ ప్రతిసారి రాస్తూనే ఉంటాడు కదా.. ఇందులో కొత్త ఏమీ లేదు కానీ.. ఈసారి విజయసాయిరెడ్డి మీద పడిపోయాడు. అది కూడా ఓ రేంజ్ లో.

    నీచ్ కమీనే స్థాయికి..

    సహజంగా తన పత్రికలో తను రాసే కొత్త పలుకు విషయంలో ఎంతో కొంత హుందాతనాన్ని రాధాకృష్ణ ప్రదర్శిస్తాడు. కానీ ఈసారి విజయసాయి రెడ్డి మీద పడిపోయాడు. అడ్డగోలుగా విమర్శలు చేశాడు..”ఏమోయ్ విజయసాయిరెడ్డి నువ్వు మనిషివేనా.. అసలు నీది మనిషి పుట్టుకేనా.. ఎంత కావాలని నన్ను అడుగుతావా.. నా ఇంటికి ఎన్నిసార్లు వచ్చావో లెక్క చెప్పనా.. నాతో ఏం మాట్లాడాలో బయటకు తీయనా.. నేను నిజాయితీగల మనిషిని.. నేను తప్పులు చేస్తే జగన్ ఊరుకుంటాడా.. నన్ను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. నన్ను ఏం చేయగలిగారు.. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. నువ్వు నా ఓపెన్ హార్ట్ ప్రోగ్రాం కి రా.. నీ సాక్షి ఛానల్ లో కూడా దాన్ని టెలికాస్ట్ చెయ్. నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. చూసుకుందాం నీ ప్రతాపం నా ప్రతాపం” అనే స్టైల్లో రాధాకృష్ణ విజయ సాయి రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు. రాధాకృష్ణ ఇటీవల కాలంలో ఎవరి మీద ఈ స్థాయిలో విరుచుకుపడలేదు. మరి అలాంటిది రాధాకృష్ణ ఎందుకు ఆ స్థాయిలో రాశాడు? విజయ్ సాయి రెడ్డికి ఆ స్థాయిలో ఎందుకు సవాల్ విసిరాడు? అనేవి మీడియా వర్గాలలో చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకీ రాధాకృష్ణ ఇంటికి విజయసాయిరెడ్డి ఎందుకొచ్చాడు.. జగన్ పంపిస్తే వచ్చాడా.. ఆ డీల్ కు రాధాకృష్ణ ఒప్పుకోలేదా? అందువల్లే రాధాకృష్ణకు ఓళ్లు మండిపోయి ఈ స్థాయిలో నిప్పులు చెరిగాడా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి మరి..