ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. అయితే కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో అనేక సందేహాలు నెలకొన్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు మృతి చెందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఏపీలో కూడా వ్యాక్సిన్ తీసుకున్న ఒక మహిళ మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read: కరోనాపై పని చేయని వ్యాక్సిన్.. 12,000 మందికి పాజిటివ్..?
పెనుమాకకు చెందిన ఆశా వర్కర్ విజయలక్ష్మి కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్న తరువాత రెండు రోజులు బాగానే ఉన్నారు. ఆ తరువాత వ్యాక్సిన్ వికటించడం వల్ల మహిళ మృతి చెందారు. ఈ నెల 21వ తేదీన తెల్లవారు జాము నుంచి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల విజయలక్ష్మీ చలి, జ్వరంతో బాధ పడుతున్నారు. అయితే వైద్యులు చికిత్స అందించినా సదరు మహిళ కోలుకోలేక మృతి చెందారు.
Also Read: కరోనా వైరస్ కొత్త లక్షణం… కంటిచూపుకే ప్రమాదం..?
అయితే మహిళ మృతి కరోనా వ్యాక్సిన్ కారణమా..? ఇతర కారణాలు ఉన్నాయా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఆశా వర్కర్ విజయలక్ష్మి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రి ఎదుట ఆశా వర్కర్లు విజయలక్ష్మి కుటుంబానికి న్యాయం జరగాలని ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం విజయలక్ష్మి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆశా వర్కర్లు కోరుతున్నారు.
మరిన్ని వార్తలు కోసం: కరోనా వైరస్
విజయలక్ష్మి కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారంతో పాటు ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సూచనలు చేస్తున్నారు. అయితే మృతురాలి పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే మహిళ మృతికి అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంటుంది.