దేశంలోని చాలామంది ఓటర్లు ఓటర్ కార్డ్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఓటర్ కార్డును వినియోగిస్తాం కాబట్టి కొంతమంది ఓటర్ కార్డ్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. ఫలితంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన సమయంలో ఓటర్ కార్డ్ లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే భారత గుర్తింపు సంఘం ఓటర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.
Also Read: గంటకు 1,700 రూపాయల వేతనం.. ఉద్యోగం ఏమిటంటే..?
సులభంగా మొబైల్ ద్వారా ఓటర్ కార్డును డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే అందరూ మొబైల్ ఫోన్ లో ఓటర్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవడం సాధ్యపడదు. రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా మాత్రమే ఓటర్ గుర్తింపు కార్డును డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా డిజిటల్ ప్రింట్ ను డౌన్ లోడ్ చేసుకోలేని వాళ్లు మీ సేవా కేంద్రాల ద్వారా 25 రూపాయలు చెల్లించి ఓటర్ కార్డును తీసుకోవచ్చు.
Also Read: ఐఎండీలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు.. వేతనం ఎంతంటే..?
రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ సహాయంతో డౌన్ లోడ్ చేసుకున్న ఓటర్ కార్డును ఎక్కడైనా సులభంగా ప్రింట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రజల్లో ఈ ఎపిక్ విధానంపై అవగాహన పెంచాలని భావించి ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ నుండి డౌన్ లోడ్ చేసుకునే ఓటర్లు ఈ నెల 25వ తేదీ నుంచి ఈ నెల 31వ తేదీ వరకు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు
అయితే కొత్తగా నమోదైన ఓటర్లు మాత్రమే ఓటర్ కార్డులను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పాత ఓటర్లు మాత్రం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. క్లిక్ ఫర్ ఏపిక్, ఈ-ఓటర్ హువా డిజిటల్ ద్వారా కూడా ఈ కార్డులను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.