https://oktelugu.com/

గంటకు 1,700 రూపాయల వేతనం.. ఉద్యోగం ఏమిటంటే..?

దేశంలో నివశించే చాలామంది విలాసవంతమైన జీవనం సాగించడానికి, ఇబ్బందులు పడకుండా ఉండటం కొరకు ఉద్యోగం చేస్తారు. అయితే ఉద్యోగం చేయాలంటే అంత తేలిక కాదు. వారంలో ఐదు రోజులు లేదా ఆరు రోజులు విశ్రాంతి లేకుండా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. అయితే ఒక కంపెనీ మాత్రం ఏ మాత్రం కష్టపడకుండా గంటకు 1,700 రూపాయలు సంపాదించే అవకాశం కల్పిస్తోంది. Also Read: ఐఎండీలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు.. వేతనం ఎంతంటే..? ఇంత మొత్తం సంపాదించాలంటే కేవలం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 24, 2021 / 01:55 PM IST
    Follow us on

    Candyfunhouse

    దేశంలో నివశించే చాలామంది విలాసవంతమైన జీవనం సాగించడానికి, ఇబ్బందులు పడకుండా ఉండటం కొరకు ఉద్యోగం చేస్తారు. అయితే ఉద్యోగం చేయాలంటే అంత తేలిక కాదు. వారంలో ఐదు రోజులు లేదా ఆరు రోజులు విశ్రాంతి లేకుండా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. అయితే ఒక కంపెనీ మాత్రం ఏ మాత్రం కష్టపడకుండా గంటకు 1,700 రూపాయలు సంపాదించే అవకాశం కల్పిస్తోంది.

    Also Read: ఐఎండీలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు.. వేతనం ఎంతంటే..?

    ఇంత మొత్తం సంపాదించాలంటే కేవలం తిండి రుచి చూస్తే సరిపోతుంది. రుచి చూడటం ద్వారా సులభంగా డబ్బులు సంపాదించడానికి క్యాండి ఫన్‌హౌస్ సంస్థ అవకాశం కల్పిస్తోంది. ఈ కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ ఉద్యోగానికి ఎంపిక కావచ్చు. కెనడాకు చెందిన ఈ సంస్థ క్యాండీ, చాక్లెట్‌ టేస్ట్‌ టెస్టర్ ఉద్యోగాల కొరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

    Also Read: మొబైల్ లోనే ఓటర్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఎలా అంటే?

    ఆసక్తి ఉన్న అభ్యర్థులు వచ్చే నెల 15వ తేదీలోగా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలోపు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైన వారు 3,000 క్యాండీలు, చాక్లెట్లను అవి ఎలా ఉన్నాయో చెప్పాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవాళ్లు వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకుంటే ప్రయోజనం చేకూరుతుంది.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    అయితే ఈ కంపెనీ దరఖాస్తు చేసుకునే వారిలో ఎంతమందిని ఎంపిక చేసుకుంటుందనే వివరాలు తెలియాల్సి ఉంది. సాధారణంగా నెల రోజుల్లో సంపాదించే వేతనాన్ని ఈ కంపెనీలో గంటలు పని చేయడం ద్వారా పొందే అవకాశం ఉంటుంది.