Car Decorated Lakhs Tapas: మనిషికి వేపకాయంత వెర్రి ఉంటుంది. అది వేయి రకాలుగా ఉంటుందట. ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన విధంగా వెర్రి ఉండటం సహజమే. కొందరికి తిరిగే అలవాటు ఉంటుంది. మరికొందరికి తాగుడు అలవాటు. ఇంకొందరికి జూదం అలవాటు. ఇలా ఒక్కో మనిషిలో ఒక్కో వెర్రి ఉండటం కామనే. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్న వ్యక్తి వెర్రి తాలూకు విషయం తెలిస్తే మనం షాకే. ఎందుకంటే అతడు ఏదో కొత్తగా ఆలోచించాడంటే బదులు చెత్తగా ఆలోచించాడని చెప్పొచ్చు. దీపావళి పండుగను అందరు సంతోషంగా జరుపుకోవడం ఆనవాయితీ. కానీ అతడి వెరైటీ కాస్త కొత్త పుంతలు తొక్కింది. అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

రాజస్తాన్ లోని అల్వార్ కు చెందిన ఓ యూట్యూబర్ దీపావళి వేళ అందరిలో టెన్షన్ నింపాడు. అందరు బాంబులు కాలుస్తుంటే అతడికో విచిత్రమైన ఆలోచన తట్టింది. అందరు ఆలోచించినట్లు ఆలోచిస్తే కిక్కేముంటుంది అనుకున్నాడో ఏమో. ఓ వినూత్న ఆలోచన చేశాడు. బాంబులు పేల్చడానికి కారును లక్ష్యంగా చేసుకున్నాడు. కారు చుట్టు లక్ష బాంబులు చుట్టాడు. ఇక వాటిని ఒకేసారి పేల్చేందుకు వన్ టూ త్రీ అంటూ అంకెలు లెక్కపెట్టి కారు మీద ఉన్న బాంబులు పేల్చాడు. దీంతో ఒక్కసారిగా బాంబుల మోత దద్దరిల్లింది.
అతడి తీరుపై నెటిజన్లు కూడా స్పందించారు. నీ పిచ్చి నా… అంటూ బూతులు తిట్టారు. అన్ని బాంబులు ఒక్కసారి పేల్చితే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. నీకు వెర్రి ఉన్నట్లు అర్థమవుతోంది. కానీ ఇంతలా వెర్రి పాతుకుపోయిందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడు చేసిన మంచి పని ఏంటంటే ఆ కారును జనం మద్య కాకుండా జనసమ్మర్థం లేని ప్రాంతానికి తీసుకెళ్లి పేల్చడం గమనార్హం. ఒకవేళ జనావాసాల్లో అయితే పెద్ద ప్రమాదం ఏర్పడేది. ఇంజన్ పేలినట్లయితే కారు తునాతునకలయ్యేది.

అద్దంపై బాంబులు పెట్టకపోయినా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కారంతా చెత్తగా తయారయింది. కానీ ఇంజన్ మాత్రం బాగానే పనిచేయడంతో బాంబులు పేల్చిన తరువాత అతడు కారును నడుపుకుంటూ వెళ్లాడు. ఇలా చెత్త ఆలోచనలు చేస్తే జనానికి ఇబ్బందులు కలుగుతాయి. ఏదైనా చేస్తే వినూత్నంగా ఉండటమొక్కటే ప్రధానం కాదు ప్రజల సౌకర్యం కూడ చూడాలి. యూట్యూబర్ చేసిన పనికి అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత భయంకరమైన చర్యకు పూనుకోవడం నిజంగా అతడి పిచ్చిపనే అని నెటిజన్లు పేర్కొంటున్నారు.
ప్రతి ముప్పైయేళ్లకి బతుకుతాలూకు ఆలోచన మారుతుంది.సినిమావాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు.వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు.రాజకీయనాయకులు తరం అంటారు..మామూలు జనం జనరేషన్ అంటారు.. ప్రతి జనరేషన్ లోనూ ఒక టార్చ్ బేరర్ ఉంటాడు..ఆ టార్చ్ బేరర్ ఇలా కారుకి టపాసులు చుట్టి నిప్పంటిస్తాడు బాల్రెడ్డీ 😝 pic.twitter.com/JMkjtS57Ug
— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) October 24, 2022