YCP vs Pawan Kalyan కాపు మంత్రులపై జనసేన క్యాడర్ దాడులు చేస్తారనే ప్రచారం జనం మధ్యలోకి వైసీపీ తీసుకొచ్చింది. గూఢచారి నివేదిక అంటూ ఒకటి బయటపెట్టారు. జగన్ దీన్ని అడ్డం పెట్టుకొని జనసేనపై ప్రజల్లో విషం చిమ్మాలనే దానిపై వ్యూహరచన చేసినట్టుగా కనిపిస్తోంది. ఈ విషయంలో ఏదో చేయబోయి ఏదో జరిగిందని అర్థమవుతోంది.

కాపు సామాజికవర్గానికి సంబంధించిన మంత్రులపై దాడులు జరుగొచ్చని.. భద్రత కల్పించాలని ఆ గూఢచారి నివేదిక తెలిపిందట.. మరి ప్రభుత్వం లీక్ చేయకుండా ఈ నివేదిక ఎలా బయటకొచ్చిందన్నది ప్రశ్న. కావాలనే ప్రభుత్వం లీక్ చేసిందంటే.. విశాఖలో లాగా ఇక్కడ కూడా ఇంకో విధంగా జనసేనను దెబ్బతీయడానికి ఒక వ్యూహం పన్నినట్టుగా కనిపిస్తోంది.
ఎందుకు కాపు మంత్రులకు భద్రత పెంచాల్సి వస్తోందన్నది ఇక్కడ ప్రశ్న. కాపు మంత్రులు స్వయంగా పవన్ ను తిట్టింది జగన్ ఆమోదించేటట్లు అయితే అంత తేలికగా దాడులు జరగవు. దీన్ని బట్టి కాపు మంత్రులే భయపడుతున్నారని అర్థమవుతోంది. ఈ విషయంలో కాపుసామాజికవర్గం కాపుమంత్రులపై గుర్రుగా ఉన్నట్టుగా ఈ నివేదికను బట్టి తెలుస్తోంది.
వైసీపీ మొదటి నుంచి జనసేనను టీడీపీ బీ టీం అన్నట్టుగా ప్రచారం చేస్తోంది. అయితే కాపు సామాజికవర్గం దాన్ని నమ్మడం లేదని అర్థమవుతోంది. పవన్ ను తమ నాయకుడిగా కాపు సామాజికవర్గం ఒప్పుకుంటుందా? అన్నది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. జగన్ చేసిన గూఢచారి నివేదిక ఏమిటీ? పవన్ కళ్యాణ్ కు జనాదరణ ఎంత ఉందన్న దానిపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..
