London: దక్షిణ భారత దేశంలో పురుషుల సంప్రదాయ కట్టులో లుంగీ కీలకం. సౌత్ ఇండియాలో ఇప్పటికీ ఈ డ్రెడిషన్ కొనసాగుతోంది. ఇది సాధారణం. అయితే ఇదే లుంగీతో లండన్ వీధుల్లో హల్ చేసింది. అదీ ఓ యువతి ధరించి వీధుల్లో హల్‌చల్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లండన్ వీధుల్లో లుంగీపై ఆమె చేసిన క్యాట్‌వాక్ ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
తమిళ యువతి..
వలేరి అనే తమిళ యువతి చాలా కాలంగా లండన్‌లో ఉంటోంది. అయితే ఈసారి తన వారసత్వ మూలాలను లండన్ వీధుల్లో సగర్వంగా ప్రదర్శించాలనుకుంది. ఈ క్రమంలో రంగు రంగుల లుంగీలు ధరించి లండన్ వీధుల్లో షాపుల్లో రీల్స్ చేసి అక్కడి ప్రజల రియాక్స్‌న్‌ను రికార్డు చేసింది. మిలియన్ లుంగీ ఇన్ లండన్ క్యాప్షన్‌తో ఆమె పోస్టు చేసిన వీడియలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లుంగీక జతగా ఓ టీషర్టు ధరించిన ఆమె ట్రెండీగా ఉండేందుకు కళ్లద్దాలు కూడా పెట్టుకుంది. లండన్ వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుటే స్థానికులు నోరెళ్లబెట్టారు.
షాపింగ్ కూడా..
ఇక వలేరి లుంగీలోనే ఓ షాప్‌కు వెళ్లింది. అక్కడి వ్యక్తి ఆమెను చూసి షాక్ అయ్యాడు. కొందరు కుతూహలం ఆపుకోలేక ఆమెను పలకరించారు. ఇలా అనేక లొకేషన్లలో చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
స్పందిస్తున్న నెటిజన్లు..
వైరల్ వీడియోలను చూసి జనాలు, ముఖ్యంగా భారతీయులు ఆశ్చర్యపోతున్నారు. భారతీయ సంప్రదాయ వస్త్రధారణను వైరల్ చేస్తున్నారు. వలేరీ చేసిన వీడియోలకు ఇప్పటికే 11 లక్షల వ్యూస్ వచ్చాయి. కొందరు ఆమె ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు కంటెంట్ క్రికేట్ కొత్తగా ఆలోచించిందని కామెంట్ చేశారు. లుంగీ వలేరికి బాగా నప్పిందని మరికొందరు పేర్కొన్నరు.
జపాన్‌లో చీరకట్టులో..
ఇలీవల ఓ భారతీయురాలు
ఇటీవల ఓ భారతీయురాలు జపాన్‌లో చీరకట్టులో హల్ చేసిన విషయం తెలిసిందే. భారత సంప్రదాయ కట్టును చూసి అక్కడివారు ఆశ్చర్యపోయారు. కొందరు ఆమెను పలకరించి చీరగురించి అడిగి తెలుసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోకు కూడా నెటిజన్లు బ్రహ్మరథం పట్టారు.భారతీయతను సగర్వంగా ప్రదర్శించిందని ప్రశంసలు కురిపించారు.