https://oktelugu.com/

London Ayurveda: లండన్‌ కాలేజీలో మన ఆయుర్వేదం!

సంప్రదాయ ఆయుర్వేద పరిజ్ఞానాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో యూకేలోని బ్రిటిష్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆయుర్వేద(బీఎస్‌ఏ)లో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు వీలుగా ఈ ఒప్పందంపై ఇరు సంస్థల ప్రతినిధులు సంతకం చేశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 2, 2024 / 10:53 AM IST

    London Ayurveda

    Follow us on

    London Ayurveda: సనాతన భారతీయ వైద్య విధానం ఆయుర్వేదం. ఇంగ్లిష్‌ వైద్యం అందుబాటులోకి వచ్చాక.. దీనిపై ఆసక్తి తగ్గింది. కానీ మళ్లీ ఇప్పుడు ఆయుద్దేవానికి డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో ఆయుర్వేదం నేర్చుకునేందుకు ఇటు భారతీయులతోపాటు, విదేశీయులు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో యూకేలోని అతి పురాతన కళాశాలలో మన దేశానికి చెందిన ఆయుర్వే ఆధునిక సమ్మిళిత వైద్యాన్ని ప్రోత్సహించేందుకు పాలీ సైంటిఫిక్‌ ఆయుర్వేద(పీఎస్‌ఏ) ఎంవోయూ కుదుర్చుకుంది. సంప్రదాయ ఆయుర్వేద పరిజ్ఞానాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో యూకేలోని బ్రిటిష్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆయుర్వేద(బీఎస్‌ఏ)లో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు వీలుగా ఈ ఒప్పందంపై ఇరు సంస్థల ప్రతినిధులు సంతకం చేశారు.

    వినూత్న కోర్సుల పరిచయం..
    ఈ ఒప్పందంలో భాగంగా.. డాక్టర్‌ పోలిశెట్టి సాయిగంగా పనాకియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ విభాగం, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పాలిసైంటిఫిక్‌ ఆయుర్వేద(ఐపీఎస్‌ఏ)లు.. యూకేలోని పురాతన ఆయుర్వేద కళాశాలలో పాలీ సైంటిఫిక్‌ ఆయుర్వేదంలో వనూత్న కోర్సులను పరిచయం చేయనుంది. లేటెస్ట్‌ టెక్నాలజీ, ఆధునిక ఔషధాలను పురాతన భారతీయ ఆయుర్వేద పరిజానంతో అనుసంధానించే జీవనశైలి వేరియబుల్‌ పాలి సైంటిఫిక్‌ ఆయుర్వేదం. సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కోసం అత్యంత ప్రభావవంతమైన పరిష్కారాలలో ఇదీ ఒకటి.

    విస్తృతి పెంపు..
    ఈ అగ్రిమెంట్‌పై లండన్‌ పార్లమెంటులోని ఆల్‌ పార్టీ పార్లమెంటరీ గ్రూప్‌ ఫర్‌ ట్రెడిషనల్‌ సైన్సెస్‌ సెక్రెటేరియేట్‌ అమర్జిత్‌ భమ్రా సమక్షంలో డాక్టర్‌ పోలిశెట్టి, డాక్టర్‌ మౌరూఫ్‌ అథిక్, డాక్టర్‌ శాంత గొడగామా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం యూకే, భారత్‌లో ప్రముఖ ఆయుర్వేద నిపుణులను ఏకతాటిపైకి తెస్తుంది. తద్వారా దాని విస్తృతి పెరుగుతుందని డాక్టర్‌ రవిశంకర్‌ పోలిశెట్టి తెలిపారు. ఆయుర్వేదం, అల్లోపతి సమ్మేళనం మెరుగైన చికిత్స అవకాశాలు అందిస్తుందన్నారు. ముఖ్యంగా చివరి దశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఇది బాగా తోడ్పడుతుందని పేర్కొన్నారు. తమ భాగస్వామ్యం ఆయుర్వేద విద్యా కార్యక్రమాలను బలోపేతం చేస్తుందని, ఆధునిక, ప్రత్యామ్నాయ వైద్య అభ్యాసకులకు విస్త్రుత నైపుణ్యాలను అందిస్తుందని వివరించారు. చివరి దశ వ్యాధులకు మరింత ప్రభావవంతంగా చికిత్స చేసే వైద్యులను తయారు చేస్తుందని వెల్లడించారు.