https://oktelugu.com/

Yanam: మరువలేక.. బతకలేక.. ప్రేమికుడి మరణంతో ఆ యువతి ఏం చేసిందంటే?

యానం యూకేవీ నగర్ కు చెందిన మీసాల మౌనిక(22) అనే యువతి రాయల్ కాలేజీలో నర్సింగ్ తృతీయ సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు పదేళ్ల క్రితం చనిపోవడంతో.. మేనమామ త్రిమూర్తుల సంరక్షణలో ఉన్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : August 22, 2023 / 10:20 AM IST

    Yanam

    Follow us on

    Yanam: ప్రేమించిన వ్యక్తి దూరం కావడంతో ఆ యువతి తట్టుకోలేకపోయింది. క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడిని తలుచుకుని మనస్థాపానికి గురైంది. చివరకు తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన యానంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

    యానం యూకేవీ నగర్ కు చెందిన మీసాల మౌనిక(22) అనే యువతి రాయల్ కాలేజీలో నర్సింగ్ తృతీయ సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు పదేళ్ల క్రితం చనిపోవడంతో.. మేనమామ త్రిమూర్తుల సంరక్షణలో ఉన్నారు. మౌనికకు ఒక అక్క,చెల్లి ఉండగా ఇద్దరికీ వివాహం జరిగింది. ప్రస్తుతం వారు అత్తింట్లో ఉన్నారు. మౌనిక మేనమామ త్రిమూర్తులు ఇంటి నుంచి రాకపోకలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో కురసం పేటకు చెందిన నిమ్మకాయల చిన్నా అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారింది. అయితే చిన్నా గంజాయి కి అలవాటు పడ్డాడు. గంజాయి తాగేందుకు 500 రూపాయలను సోదరుడ్ని అడిగాడు. ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

    చిన్నాతో జీవితం పంచుకోవాలని భావించిన మౌనిక కన్నీరు మున్నీరు అయింది. కాలేజీకి వెళ్లడం మానేసింది. చిన్నా బట్టలను ఎదురుగా పెట్టుకొని రోదించేది. రోజులు గడుస్తున్న చిన్నా జ్ఞాపకాలు విడవకపోవడంతో.. మనస్థాపంతో ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.