Tollywood Producer- Heroine: రీసెంట్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు నిర్మించి టాలీవుడ్ లో అగ్ర నిర్మాతలలో ఒకరిగా దూసుకొచ్చిన ఒక కుర్ర నిర్మాత ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ మోజులో పడి డబ్బులు మొత్తం నీళ్లు లాగా ఖర్చుపెట్టేస్తున్నాడు..మూవీ బడ్జెట్ ఎంత అవుతుంది అనేది కాసేపు పక్కన పెట్టేస్తే కేవలం ఆ హీరోయిన్ కోసం ఇతగాడు చేస్తున్న ఖర్చు మూవీ బడ్జెట్ ని కూడా దాటిపోయ్యే రేంజ్ లో ఉంటుందట..ఆమె ఏది కోరితే అది నిమిషాల్లోనే తెచ్చి పెట్టేస్తున్నాడట.

రీసెంట్ గా న్యూ ఇయర్ కి కూడా ఆమె కోసం కోట్ల రూపాయిలు ఖరీదు చేసే బహుమతి ని కూడా ఇచ్చాడట..అంతే కాకుండా ఆ హీరోయిన్ రీసెంట్ గానే తన కాళ్లకు దెబ్బలు తగిలించుకుంది..అది తెలుసుకున్న ఆ కుర్ర నిర్మాత ఆమెకి నయం అయ్యేంత వరకు హాస్పిటల్ ఖర్చులు అన్నీ తానే భరించాడట..ఇలా ఆ హీరోయిన్ మీద ఎక్కడలేని ప్రేమ చూపించేస్తున్నాడు ఆ కుర్ర నిర్మాత.
తనకి గట్టిగా ట్రై చేస్తున్నాడనే విషయం ఆ స్టార్ హీరోయిన్ కి కూడా తెలుసు..కానీ తెలిసీ తెలియనట్టే ఎవరైనా అడిగితే తన పట్ల కేరింగ్ అని చెప్పేస్తుందట..ఒకప్పుడు టాలీవుడ్ కి గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్, ఇప్పుడు ఐరన్ లెగ్ గా మారింది..రీసెంట్ గా ఆమె చేస్తున్న సినిమాలన్నీ కూడా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యాయి..ఆమెతో సినిమాలు చేయాలంటేనే నిర్మాతలు ఇప్పుడు భయపడే పరిస్థితి ఏర్పడింది.

కానీ ఆమెని తన లేటెస్ట్ సినిమాలో అడిగినంత పారితోషికం ఇచ్చి డేట్స్ లాక్ కూడా చేసేసుకున్నాడట ఈ యంగ్ ప్రొడ్యూసర్..ఇంకా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు..ఇక ఇటీవలే వీళ్లిద్దరు కలిసి ఫారిన్ ట్రిప్ కి వెళ్లారట..అక్కడ కూడా ఈమె కోసం ఇష్టమొచ్చినట్టు డబ్బులు దారబోస్తున్నాడట..చిక్కిందే ఛాన్స్ అని ఆ స్టార్ హీరోయిన్ కూడా మనోడిని బాగా వాడేస్తుంది.