Viral Video : ఇన్ స్టా గ్రామ్ లో (Instagram) ట్రెండ్(Trend) అవుతున్న వీడియో ప్రకారం.. యువ యువకుడు తమ గ్రామ సమీపంలో ఓ చెరువు కట్టపై గేదపై కూర్చొని దూసుకు వస్తుంటాడు. అతడు దూసుకు వస్తుండగా అదిగో భైరవ అంటూ మగధీర(magadheera) బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది.. ఆ మ్యూజిక్ తగ్గట్టుగానే ఆ యువకుడు ఆ గేదెను పరుగులు పెట్టిస్తాడు. ఆ గేదె కూడా గుర్రం లాగా పరుగులు పెడుతుంది. కట్ట చివరిదాకా అదే వేగంతో పరుగులు తీస్తుంది.. ఈ వీడియో ఇన్ స్టా గ్రామ్ లో ఇప్పటికే లక్షలాది వీక్షణలు సొంతం చేస్తుంది..
యముడికి కొడుకువా..
ఈ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి.. మగధీర పార్ట్ -2 కనుక ఒకవేళ రాజమౌళి తీస్తే.. అందులో రామ్ చరణ్ ఇదేవిధంగా గుర్రాన్ని దౌడు తీయిస్తాడని రాస్కొచ్చాడు.. అయితే ఈ వీడియో చూసిన చాలామంది కూర్చున్న వ్యక్తిని ఉద్దేశించి రకరకాల కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఒకతనేమో ఆ గేదె అలాగే ముళ్ళపొదల్లోకి దూసుకు వెళ్తే ఏం చేస్తావు.. అని ప్రశ్నించగా.. మరో వ్యక్తి యముడికి కొడుకువా? నేరుగా యమలోకం నుంచి వచ్చావా? లేకుంటే గేదెతో ఆ విన్యాసాలు ఏంటని? వ్యాఖ్యానించాడు.. ఇంకో వ్యక్తి అయితే మగధీర సినిమాలో రామ్ చరణ్ గుర్రం మీద పరుగులు పెడుతుంటే హాలీవుడ్ హీరో లాగా ఉన్నాడు.. నువ్వేమో గేదె పై కూర్చొని.. దానితో పరుగులు తీస్తూ.. ముళ్ళ పంది లాగా ఉన్నావని మరొక వ్యక్తి పేర్కొన్నాడు. మరికొందరేమో.. సోషల్ మీడియా పిచ్చి వల్ల ఫేమస్ అవ్వాలని అనుకున్నావ్ సరే.. గేదెను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్.. నీ బరువును మోయలేక గేదె చాలా ఇబ్బంది పడుతోంది.. అది గమనించావా ముందు అంటూ దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో సెలబ్రెటీ అవ్వాలని అనుకున్నాడు కాబట్టి.. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తున్నాడు. ఆ గేదెను ఇతడిపై కూర్చోబెడితే అప్పుడు తెలిసేది దాని బాధ అంటూ.. మరికొందరు ప్రశ్నించారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.. ఈ వీడియో పై ఎవరికి వారే కామెంట్లు చేస్తున్నారు. అయితే ఒక్క కామెంట్ కూడా పాజిటివ్ గా రాలేదు. పైగా ఆ గేదె పై కూర్చుని సవారీ చేసిన వ్యక్తికి ప్రశంసలకు బదులుగా విమర్శలు రావడం విశేషం.
కొంతమంది అయితే ఇలాంటి విన్యాసాలు చేసే వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. పెటా సంస్థ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. జంతువులను హింసించడం అత్యంత పాపమని.. ఆ లెక్కన ఇతడికి సెలబ్రిటీ కావాలని ఉండి ఉంటే.. ఆ గేదెవెంట పరుగులు తీస్తే సరిపోయేదని.. ఇలా గేదె పై కూర్చొని దానిని ఇబ్బంది పెట్టడం ఏంటని మండిపడుతున్నారు. ఇలాంటి వారికి బుద్ధి రావాలంటే కచ్చితంగా పోలీసులు తమ స్థాయిలో నాలుగు పీకులు పీకితే సరిపోతుందని చెబుతున్నారు. ఇంకొందరేమో ఎలా అయినా సరే సోషల్ మీడియాలో సెలబ్రిటీ కావాలనుకున్నాడు. ఆ దిశగా గేదెను ఉపయోగించుకున్నాడు.. మొత్తానికి ఇతడు యముడికి కొడుకు అని నిరూపించుకున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు.