Prabhas
Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో ప్రభాస్ (prabhas) లాంటి స్టార్ నటుడు కూడా మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే బాహుబలి 2 (Bahubali 2), సలార్ (salar), కల్కి (kalki) లాంటి సినిమాలతో భారీ విజయాలను అందుకున్న ఆయన పాన్ ఇండియాలో సూపర్ స్టార్ గా మారడమే కాకుండా నెంబర్ వన్ హీరోగా మారే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఇప్పటివరకు వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతు ఉండటం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ ఇప్పుడు ఫౌజీ(Fouji), స్పిరిట్ (Spirit) లాంటి సినిమాలను చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం ప్రభాస్ ఫౌజీ(Fouji) సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు ఆయనకు గాయం అయింది అంటూ హుటాహుటిన అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆయన షోల్డర్, లెగ్ ఇంజురీతో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక వీటికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆయన ఇటలీ వెళ్ళబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పటికే బాహుబలి సినిమా సమయం నుంచి ఆయనకి ఇంజురీ ల మీద ఇంజురీలు అవుతూనే ఉన్నాయి. అలాగే సర్జరీల మీద సర్జరీలు చేస్తూనే ఉన్నారు.
మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు ఆయనకు అలాంటి ఇంజూరిలు జరుగుతున్నాయి. ఆయన బాడీ సినిమాలు చేయడానికి సపోర్ట్ చేయడం లేదా? ఇక కల్కి సినిమా ఈవెంట్ లో అయితే ప్రభాస్ నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. బాహుబలి సమయం లో చాలా స్ట్రాంగ్ గా ఉన్న ప్రభాస్ ఇప్పుడు మరి దారుణంగా తయారయ్యాడు.
దానికి గల కారణం ఏంటి? తరచుగా అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఇంజురీస్ ఎందుకు జరుగుతున్నాయి. ఆయన విషయంలో అసలు ఏం జరుగుతుంది అంటూ కొంతమంది విమర్శకులు సైతం ప్రభాస్ ను విమర్శిస్తున్నారు. మరి అతను సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఎందుకంటే ఇప్పటికే స్టార్ డైరెక్టర్లు సైతం అతనితో సినిమాలు చేయడానికి క్యూలో ఉన్నప్పటికి ఆయన ఎవరితో సినిమాలు చేస్తూ ఎప్పుడు సినిమాలను కంప్లీట్ చేస్తాడనే విషయం మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు… ఇక ఇప్పుడు మరోసారి అతనికి సర్జరీ చెయ్యాలి అంటు కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి వీటన్నింటిని ముగించుకొని ఆయన సినిమా షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…