Homeట్రెండింగ్ న్యూస్Husbend-Wife : భర్తపై వాత్సల్యం బుక్ లో రాసి..పగతో డ్రగ్స్ తాగించి.. ఓ మహిళ పైశాచికం

Husbend-Wife : భర్తపై వాత్సల్యం బుక్ లో రాసి..పగతో డ్రగ్స్ తాగించి.. ఓ మహిళ పైశాచికం

Husbend-Wife : ఓ మహిళ తన భర్త మరణాన్ని తట్టుకోలేకపోయింది. ఆయనతో గడిపిన క్షణాలను, మధురానుభూతులను నెమరువేసుకుంటూ ఓ పుస్తకం రాసింది. తండ్రి మరణం నుంచి పిల్లలను బయటపడేసేందుకే ఆ పుస్తకం రాసినట్టు చెప్పుకొచ్చింది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు ఆమె ఔదర్యాన్ని, భర్తపై ఉన్న వాత్సల్యాన్ని చూసి పొంగిపోయారు. పుస్తకం చదివిన పాఠకులు ఆమెను అభినందనలతో ముంచెత్తారు. అయితే ఆమె భర్తది సహజ మరణం కాదని తేలింది. అంతకంటే ట్విస్టు ఏమిటంటే భర్తను చంపింది ఆమేనని నిర్థారణ అయ్యింది. అమెరికాలో వెలుగు చూసింది ఈ ఘటన.

కౌరీడార్డన్ రిచిన్స్, ఎరిక్ రిచిన్స్ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గత ఏడాది మార్చి 4న ఎరిక్ రిచిన్స్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో భార్య కారీ డార్డన్ రిచిన్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. తన భర్త శరరీంగ చల్లబడిందని.. కొంచెం మద్యం తీసుకున్నారని చెప్పుకొచ్చింది. వైద్యులు ఎరిక్ రిచిన్స్ కి వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. చికిత్సపొందుతూ ఆయన కన్నుమూశాడు. అయితే ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కారీడార్డన్ రిచిన్స్ ‘ఆర్ యూ విత్ మీ’ పేరిట పుస్తకాన్ని రాసింది. ఆ పుస్తకం ఎంతో పాఠకాదరణ పొందింది. అయితే ఎరిక్ రిచిన్స్ మరణంపై మాత్రం పోలీసుల దర్యాప్తు కొనసాగుతూ వచ్చింది.

ఈ విచారణలో భాగంగా ఎరిక్ రిచిన్స్ మోతాదుకు మించి డ్రగ్ వినియోగించడం వల్లే ప్రాణాలు పోయాయని అటాప్సీలో గుర్తించారు. ఎరిక్ రిచిన్స్ తాను చనిపోక ముందు తన భార్య తనపై విష ప్రయోగం చేస్తోందని చెప్పుకొచ్చారు. దీంతో విషయం పోలీసులకు తెలియడంతో హత్యగా భావించి దర్యాప్తు ప్రారంభించారు. చనిపోయే ముందు ఆమె కాల్ లీస్టునుచూడగా నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. ఆమె ఓ డ్రగ్ డీలరుతో తరచూ మాట్లాడినట్టు గుర్తించారు. తనకు వెన్నునొప్పి ఉందని.. భరించలేకపోతున్నానని చెప్పి ఆయన్నుంచి డ్రగ్ పొందింది. సరిగ్గా గత ఏడాది మార్చి 4న తనకు వెన్నునొప్పి మరింత తీవ్రమైందని.. ఎక్కువ డోసు కలిగిన డ్రగ్ కావాలని అడిగింది. దీంతో ఆయనిచ్చిన డ్రగ్ ను భర్తపై ప్రయోగించి హత్య చేసింది. తిరిగి ఏమీ ఎరగనట్టు భర్తపై వాత్సల్యం చూపుతూ ఏకంగా ఓ పుస్తకమే రాసింది. కానీ తానొకటి తలిస్తే.. దైవం ఒకటి తలచింది మాదిరిగా కటకటలాపాలైంది.

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version