Delhi Bus: మెట్రో రైళ్లలో యువత పిచ్చి వేశాలు వేయడం ఇటీవల కామన్ అయింది. కొందరు రీల్స్ చేస్తుంటే.. కొందరు వెకిలిచేష్టలు చేస్తున్నారు. ఇంకొందరు ఫోన్ కాల్స్ పేరుతో ఫ్రాంక్ చేస్తున్నారు. కొందరు లవర్స్ రొమాన్స్ చేసుకున్న సంఘటనలు కూడా చూశాం. ఇప్పుడు ఈ పిచ్చి పీక్స్‌కు చేరినట్లు ఉంది. ఢిల్లీలో ఓ అమ్మడు బికినీలో బస్సు ఎక్కి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో బుధవారం(ఏప్రిల్ 17న)వైరల్‌గా మారింది. బికినీలో బస్సెక్కిన యువతిని చూసి ప్రయాణికులు షాక్ అయిన దృశ్యాలు కూడా ఈ వీడియోలో రికార్డు అయ్యాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
టూపీస్ బికినీలో…
ఈ వీడియోలో ఓ మహిళ కేవలం టూ పీస్ బికినీలో బస్సెక్కడం కనిపించింది. అప్పటికే బస్సులో నిలబడి ఉన్న ఓ వృద్ధురాలు పక్కకు వెళ్లిపోగా సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడు కూడా లేచి వెళ్లిపోయాడు. ఈ వీడియోను దీపికానారాయణ భరధ్వాజ్ అనే యూజర్ ఎక్స్‌లో పోస్టు చేశాడు.
లక్షల్లో వ్యూస్..వేలల్లో కామెంట్స్..
ఇక ఈ వీడియోకు లక్ష్యల్లో వ్యూస్ వచ్చాయి. కేవలం 24 గంటల్లో 10 లక్షల మంది దీనిని వీక్షించారు. అలాగే వీడియో కింద భారీ సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. చాలా మంది ట్రెండ్‌కు తగ్గట్లుగా ఆ మహిళా ఉందామనుకున్నట్లు కనిపిస్తోందని కామెంట్ చేశారు. కొందరు ఇదేం ఖర్మరా బాబు అని పేర్కొన్నారు. కలికాలం అని మరికొందరు.. అని స్పందించారు. ఒక యూజర్ ‘అది ఆమె శరీరం.. ఆమె ఇష్టం. ఆమె మానాన ఆమెను వదిలేయండి’ అని పోస్టు చేశాడు. ‘ఇక చాలు. నేను ఎక్స్ లో అన్నీ చూసేశాను. ఇక నా వల్ల కాదు’ అని మరొకరు కామెంట్ చేశాడు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కొందరు యూజర్లు సూచించారు. అయితే దీనిపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు.
What’s really happening pic.twitter.com/rfjavOsWMp
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) April 17, 2024