spot_img
Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం టైటిల్ లీక్డ్... క్రేజీగా ఉందే!

Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం టైటిల్ లీక్డ్… క్రేజీగా ఉందే!

Bellamkonda Sai Sreenivas: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దాదాపు మూడు ఏళ్ల గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఆయన చివరి చిత్రం అల్లుడు అదుర్స్ 2021లో విడుదలైంది. వరుస ప్లాపులతో రేసులో వెనుకబడ్డాడు బెల్లంకొండ శ్రీనివాస్. తిరిగి ఫార్మ్ లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఏకంగా మూడు సినిమాలు ప్రకటించారు. ఇప్పటికే తన పదో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా తన పదకొండవ సినిమాను అనౌన్స్ చేశారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రానికి నిర్మాతగా సాహు గారపాటి వ్యవహరిస్తారు. ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించనున్నాడు . ఏప్రిల్ 17న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కాగా ఈ పోస్టర్ ఆకట్టుకుంది. హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కనుందని సమాచారం. కాగా ఈ చిత్రానికి ‘కిష్కిందపురి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం.

కిష్కిందపురి అనేది ఒక ఊహాజనిత ప్రదేశం. కాగా ఈ సినిమా కధంతా ఆ ఊరి చుట్టూ తిరుగుతుందట. కోతులకు ఈ సినిమా కథకి చిన్న లింక్ ఉందట. ఈ కథలో హర్రర్ మిస్టరీ తో కూడిన చాలా ట్విస్టులు ఉన్నాయట. అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న టైసన్ నాయుడు షూటింగ్ జరుగుతుంది. అల్లుడు శ్రీను సినిమాతో పరిశ్రమలో అడుగుపెట్టాడు బెల్లంకొండ. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు.

ఆ తర్వాత జయ జానకి నాయక మూవీతో మరో హిట్ సొంతం చేసుకున్నాడు. అలా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసాడు. తెలుగులో సూపర్ హిట్ అయిన చత్రపతి హిందీలో పెద్దగా ఆడలేదు. దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ కి నిరాశ మిగిలింది. కాస్త బ్రేక్ తీసుకుని ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు.

Exit mobile version