https://oktelugu.com/

Devara Movie: దేవర మూవీలో మరో స్టార్ హీరోయిన్… ఐటెం సాంగ్ కోసం రంగంలోకి ఆ హాట్ బ్యూటీ!

ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఆమెకు ఇది ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ. దేవర మూవీలో జాన్వీ పాత్ర చాలా కీలకమని దర్శకుడు కొరటాల శివ వెల్లడించారు.

Written By:
  • S Reddy
  • , Updated On : April 20, 2024 / 05:13 PM IST

    pooja hegde doing item song in Devara Movie

    Follow us on

    Devara Movie: ఎన్టీఆర్ నటించిన దేవర కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత ఆరేళ్లలో ఎన్టీఆర్ చేసింది ఆర్ ఆర్ ఆర్ మాత్రమే. ఈ చిత్రం విడుదలై రెండేళ్లు దాటిపోయింది. ఇక దేవర ఈ సమ్మర్ కానుకగా విడుదల కావాల్సింది. నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. దాంతో దసరాకు వాయిదా వేశారు. దర్శకుడు కొరటాల శివ తన కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో దేవర తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర బడ్జెట్ రూ. 300 కోట్లు అని సమాచారం. పాన్ ఇండియా చిత్రం ఐదు భాషల్లో విడుదల కానుంది.

    ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఆమెకు ఇది ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ. దేవర మూవీలో జాన్వీ పాత్ర చాలా కీలకమని దర్శకుడు కొరటాల శివ వెల్లడించారు. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ రోల్ చేస్తున్నారు. విశేషం ఏమిటంటే.. దేవర సైతం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడని సమాచారం. ఇదిలా ఉండగా దేవర గురించి ఓ క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది.

    దేవర చిత్రంలో అదిరిపోయే మాస్ ఐటెం సాంగ్ ఒకటి ఉందట. ఈ సాంగ్ పూజ హెగ్డే చేయనుందట. ఈ మేరకు చర్చలు కూడా జరిగాయట. ఎన్టీఆర్-పూజ హెగ్డే ఐటెం సాంగ్ లో రచ్చ చేయడం ఖాయం అంటున్నారు. పూజ హెగ్డే గతంలో రంగస్థలం మూవీలో ఐటెం సాంగ్ చేసింది. మరలా ఇన్నేళ్ల తర్వాత దేవర మూవీలో ఐటెం భామగా సందడి చేయనుందని సోషల్ మీడియా టాక్. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

    దేవర మూవీ అక్టోబర్ 10న విడుదల కానుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇక పూజ రేసులో వెనుకబడింది. 2022 నుండి ఆమెకు వరుస ప్లాప్స్ ఎదురయ్యాయి. పూజ హెగ్డే సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలం అవుతుంది. అధికారికంగా పూజ హెగ్డే ఒక్క ప్రాజెక్ట్ కూడా ప్రకటించలేదు. సాయి ధరమ్ తేజ్ కి జంటగా గంజా శంకర్ చిత్రానికి సైన్ చేసిందని వినికిడి. అవకాశాలు లేని పూజ ఐటెం సాంగ్ కి ఒప్పుకుందన్న వాదన వినిపిస్తోంది.