Woman Dance Delhi Metro: ఇటీవల మెట్రో రైళ్లలో డ్యాన్సులు చేయడం ఫ్యాషన్‌గా మారింది. చాన్స్ దొరికితే చాలు తమలోని టాలెంట్‌ను బయటపెట్టేస్తున్నారు. వేదిక ఏదైతేనేం.. జనం చూస్తే చాలని కొంతమంది…సోషల్ మీడియాలో ఫాలోవర్స్, లైక్స్ పెంచుకుని ఫేమస్ కావాలని మరికొంతమంది తమ టాలెంట్ బయటపెట్టానికి మెట్రో రైళ్లను ఎంచుకుంటున్నారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోని మెట్రో రైళ్లలో ఇరగదీస్తున్నారు. మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ.. పట్టించుకోకుండా హద్దులు మీరుతున్నారు. రైళ్లలో డ్యాన్సులు వద్దని అదికారులు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు.
తాజాగా ఢిల్లీ మెట్రోలో..
మెట్రోలో లవర్స్ శ్రుతి మించి వ్యవహరించడం, యువతీ యువకుల డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రోల ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. బ్లాక్ టాప్, బ్లూ జీన్స్ ధరించిన యువతి నేహా బాసిన్, బిప్పి లహరి పాడిన ‘అసలామ్ ఈ ఇష్క్’ పాటకు డ్యాన్స్ చేసింది. మెట్రో మధ్యలో నిలబడి ఉత్సాహంగా స్టెప్పులు వేసింది. తోటి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా.. ఏ మాత్రం పట్టించుకోకుండా డ్యాన్స్ చేసింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో..
యువతి ఏం ఆశించి డ్యాన్స్ చేసిందో అదే నెరవేరింది. డ్యాన్స్ చేస్తుండగా తోటి ప్రయాణికుడొకరు వీడియోతీశాడు. దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఇంకేముందు.. డ్యాన్స్ బాగుండడం, అమ్ముడు కూడా అందంగా ఉండడంతో యూత్ లైక్స్, షేర్స్‌తో తమ సంతృప్తిని తెలియపరుస్తున్నారు. ఇకొంతమంది కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాగా డ్సాన్స్ చేశారని కొందరు మెచ్చుకోగా.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. మరి అధికారులు ప్రయాణికుల ఇబ్బంది తొలగించడానికి, ఇలాంటి వెర్రి చేష్టలకు చెక్ పెట్టడానికి ఏమైనా చర్యలు తీసుకుంటారో చూడాలి.