https://oktelugu.com/

Waltair Veerayya: 150 రోజులు పూర్తి చేసుకున్న ‘వాల్తేరు వీరయ్య’.. ఎన్ని సెంటర్స్ లో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

కృష్ణ జిల్లా ప్రాంతం లో మెగాస్టార్ చిరంజీవి కి ఎవ్వరూ ఊహించని క్రేజ్ ఉంటుంది, ఇది అందరికీ తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత ఆయన 5 సినిమాలు చేస్తే అందులో మూడు సినిమాలు టాప్ 5 లో ఉంటాయి. అది ఆయన రేంజ్, ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' సినిమా కూడా కృష్ణ లోని అవనిగడ్డ ప్రాంతం లో 150 రోజులు పూర్తి చేసుకుంది.

Written By:
  • Vicky
  • , Updated On : June 12, 2023 / 10:44 AM IST

    Waltair Veerayya

    Follow us on

    Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద సంచలన విజయం సాధించింది సంగతి అందరికీ తెలిసిందే. సంక్రాంతి పోరులో దిగిన ఈ చిత్రం, సుమారుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి ఆల్ టైం టాప్ 5 మూవీస్ లో ఒకటిగా నిల్చింది.వరుసగా ‘ఆచార్య’ మరియు ‘గాడ్ ఫాదర్’ వంటి సినిమాలతో అభిమానులను నిరాశపర్చిన మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యి మెగా అభిమానుల్లో జోష్ నింపాడు.

    ఇప్పటికీ ఈ సినిమా రికార్డ్స్ వేట ఆగింది అనుకుంటే పొరపాటే. 50 రోజులు మరియు వంద రోజులు అత్యధిక సెంటర్స్ లో పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఇప్పుడు 150 రోజులు కూడా పూర్తి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

    కృష్ణ జిల్లా ప్రాంతం లో మెగాస్టార్ చిరంజీవి కి ఎవ్వరూ ఊహించని క్రేజ్ ఉంటుంది, ఇది అందరికీ తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత ఆయన 5 సినిమాలు చేస్తే అందులో మూడు సినిమాలు టాప్ 5 లో ఉంటాయి. అది ఆయన రేంజ్, ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కూడా కృష్ణ లోని అవనిగడ్డ ప్రాంతం లో 150 రోజులు పూర్తి చేసుకుంది.

    అక్కడ రామకృష్ణ థియేటర్ లో జనవరి 13 వ తారీఖు నుండి నేటి వరకు నాలుగు ఆటలతో రామకృష్ణ థియేటర్ లో 150 రోజులు పూర్తి చేసుకుందని , నిన్న ఆదివారం కూడా ఒక షో హౌస్ ఫుల్ అయ్యిందని, 200 రోజులు ఈ చిత్రం నాలుగు ఆటలతో కచ్చితంగా పూర్తి చేసుకుంటుంది అనే నమ్మకం ఉందని ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ చెప్తున్నారు. ఓటీటీ కాలం లో ఒక సినిమా 200 రోజులు పూర్తి చేసుకుంది అంటే సాధారణమైన విషయం కాదు.