Delhi Railway Station
Delhi Railway Station: సోషల్ మీడియాలో అమ్మ చేసే త్యాగాల గురించి.. అమ్మ పంచే ప్రేమ గురించి ఎన్నో వీడియోలు కనిపిస్తుంటాయి. అయితే ఈ వీడియో మాత్రం వాటన్నిటికంటే పూర్తి భిన్నమైనది. ఎందుకంటే ఒక చేతితో పాలన.. మరో చేత్తో లాలన చూపిస్తూ ఓ తల్లి.. మాతృత్వానికి సిసలైన ప్రతీకగా నిలిచింది. ఈ వీడియో ఇప్పటికే లక్షలాది వ్యూస్ సొంతం చేసుకుంది. అమ్మ ప్రేమను.. ఆమె ఉద్యోగ నిరతిని చూసి చాలామంది నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
ఒడిలో చంటిబిడ్డ.. మరో చేతిలో లాఠీ..
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కాని.. సామాజిక మాధ్యమాలలో మాత్రం తెగ సందడి చేస్తోంది ఈ వీడియో. ఆ వీడియోలో ఉన్న ఓ మహిళ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇంతకీ ఆమె చేసిన పని ఏంటంటే.. ఆమె రైల్వే శాఖలో ఓ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. సరిగా రెండు సంవత్సరాల క్రితం ఆమెకు వివాహం జరిగింది. గత ఏడాది గర్భం దాల్చింది. పండంటి బాబుకు జన్మనిచ్చింది. అతడి వయసు ప్రస్తుతం ఆరు నెలలు.. ఆ బాబును ఇంటిదగ్గర వదిలి వెళ్ళడం ఆమెకు ఇష్టం లేక.. తనతోపాటు డ్యూటీకి తీసుకువచ్చింది.. బేబీ సేఫ్టీ బెల్ట్ సహాయంతో తన ఒడిలో ఉంచుకున్నది. స్టేషన్ మొత్తం తిరుగుతూ కనిపించింది.. కుటుంబంతోపాటు ప్రయాణికుల భద్రతను ఒకేసారి పర్యవేక్షిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షించింది.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సంచలనం సృష్టిస్తోంది..” అమ్మ ప్రేమ చాలా గొప్పది. ఆమె త్యాగ నిరతి అన్నింటికంటే అజరామరమైనది. అందువల్లే మాతృదేవోభవ అనే సూక్తి పుట్టింది. దానిని ఈ రైల్వే కానిస్టేబుల్ నిజం చేసి చూపిస్తున్నారు. ఇంతకంటే గొప్పగా ఎవరు ఉండగలరు.. ఒక చేత్తో పాలన.. మరొక చేత్తో లాలన చేస్తూ ఈమె మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. ఇటువంటి వారు సమాజానికి మార్గదర్శకులుగా ఉంటారని” నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇంట్లో చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో ఆ మహిళా కానిస్టేబుల్ తన చంటిబాబును ఇలా విధుల వద్దకు తీసుకొచ్చారని తోటి సిబ్బంది అంటున్నారు.. అయితే ఆ మహిళా కానిస్టేబుల్ ఎక్కడ పని చేస్తున్నారు? ఏ రైల్వేస్టేషన్లో ఈ ఘటన జరిగిందో తెలియ రాలేదు.. అయితే ఆ కానిస్టేబుల్ పనితీరు చూసిన చాలామంది ప్రశంసల జలు కురిపిస్తున్నారు.. ఆరు నెలల చంటి బాబుతో బయటికి వచ్చి.. ఇలా విధులు నిర్వహించడం అంటే మామూలు మాటలు కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
ఆమె ఓ రైల్వే పోలీస్.. ఉదయం నుంచి రాత్రి వరకు డ్యూటీ చేయాలి.. ఆమెకు ఆరు నెలల వయసు ఉన్న పాప ఉంది. ఆమెను ఇంటి వద్ద వదిలేయలేక.. పాత పాటు డ్యూటీకి తీసుకువచ్చింది. #motherslove #motherhood#motherdaughter#MotherNature#railwaypolice#babysafetybelt pic.twitter.com/L7NVX8mnAQ
— Anabothula Bhaskar (@AnabothulaB) February 17, 2025