https://oktelugu.com/

Ramya Krishnan : రమ్యకృష్ణ కి ఆ మాజీ సిఎం కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..? స్వయంగా ఆయనే ఈ విషయాన్ని చెప్పారు..?

ఒక సినిమా కోసం రాసే ప్రతిపాత్రకి ఎక్కడో ఒక దగ్గర నుంచి స్ఫూర్తి అయితే పొందుతూ ఉంటారు. దర్శకుడు, రచయిత ఇద్దరు కలిసి బాగా రాసుకొని దానిని తెరమీద అద్భుతంగా ఆవిష్కరించడానికి సన్నాహాలు చేసుకుంటారు. ఇక ఇందులో కొన్ని నిజ జీవితపు పాత్రల ద్వారా కూడా కొన్ని క్యారెక్టర్లు రాసుకుంటూ ఉంటారు...

Written By: , Updated On : February 18, 2025 / 08:48 AM IST
Ramya Krishnan

Ramya Krishnan

Follow us on

Ramya Krishnan : సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి రమ్యకృష్ణ తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో నటించి మెప్పించడమే కాకుండా ఆమె కంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా సంపాదించుకుంది. తెలుగు తో పాటు తమిళ్ కూడా పలు హీరోలతో నటించి మెప్పించడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేసింది. ఇక ఇదిలా ఉంటే రజనీకాంత్ (Rajinikanth) హీరోగా కే ఎస్ రవికుమార్ (K S Ravikumar) దర్శకత్వంలో వచ్చిన నరసింహ (Narasimha) సినిమాలో నీలాంబరి(Neelambhari) పాత్రను పోషించి సగటు ప్రేక్షకులందరిని మెప్పించింది… ఇక నీలాంబరి అనే పాత్ర ఇప్పటివరకు చాలా స్పెషల్ గా నిలిచింది అంటే అందులో రమ్యకృష్ణ తన విలనిజాన్ని పీక్స్ కి తీసుకెళ్లిందనే చెప్పాలి. రజనీకాంత్ తో పోటీపడి మరి నటించి ఎక్కడ తగ్గకుండా చివరి వరకు తన పొగరును చూపించింది.ఈ సినిమా వల్ల రజనీకాంత్ కంటే రమ్యకృష్ణ కే చాలా ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఈ సినిమా పరిలీజ్ అయి 25 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో రీసెంట్ గా ఈ సినిమా దర్శకుడు అయిన కె ఎస్ రవికుమార్ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఈ సినిమాను చూసిన అప్పటి సీఎం జయలలిత చాలా బాగుందని తనను అప్రిషియేట్ చేసిందట. ఒకరకంగా చెప్పాలంటే ఇందులో రమ్యకృష్ణ పోషించిన పాత్రకి స్పూర్తి జయలలిత గారే అనే విషయం అందరికి తెలిసిందే. తను కూడా ఆ పాత్ర చాలా అద్భుతంగా ఉందని కే ఎస్ రవికుమార్ తో చెప్పిందట.

అయితే అప్పటి సీఎంగా ఉన్న జయలలితను ఎక్కడ తగ్గకుండా రమ్యకృష్ణ తన రాజసాన్ని చూపించి ఒక హై లెవెల్లో నిలిపిందనే చెప్పాలి. తద్వారా ఈ సినిమాకి భారీ గుర్తింపు రావడమే కాకుండా తన పాత్రకి కూడా గొప్ప గొప్ప వారి నుంచి ప్రశంసలైతే అందాయి.

ఒకరకంగా రమ్యకృష్ణ పోషించిన పాత్ర జయలలితదే కావడం. ఇక ఆమె కూడా ఆ పాత్ర గురించి గొప్పగా మాట్లాడటం ఆ క్యారెక్టర్ అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పిండం కే ఎస్ రవికుమార్ ను ఆనందపరచిందట. మరి ఏది ఏమైనా కూడా పట్టిన పట్టు విడవకుండా నీలాంబరి చివరి వరకు ఒక టెంపో ను మెయింటైన్ చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

తన క్యారెక్టర్జేషన్ లో ఎక్కడ కూడా డివిషన్స్ లేకుండా దర్శకుడు ఆ పాత్రను తీర్చిదిద్దాడు. మొదట్లో ఆమె ఎలాగైతే ఉంటుందో సినిమా చివరి వరకు కూడా అదే పాత్రలో అంటే టెంపో ను మెయింటైన్ చేస్తూ రావడం అనేది మామూలు విషయం కాదు. ఒక రకంగా చెప్పాలంటే నీలాంబరి అనే ఒక పవర్ ఫుల్ పాత్ర రమ్యకృష్ణ కెరియర్ ను కూడా మార్చేసిందనే చెప్పాలి…