Electric Tesla Car: కొన్ని పనులు చేసేటప్పుడు మన అజ్ఞానం వలో, తెలిసి తెలియనితనం వల్లో ఎదుటి వారికి కోపం తెప్పిస్తాయి. ఒక్కోసారి నవ్వు పుట్టిస్తాయి. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది ఫేమస్ అయ్యేందుకు కొన్ని కొన్ని సార్లు ఫ్రాంక్ వీడియోలు చేస్తూంటారు. ఈమధ్య ఆదరణ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఒక యువతి కారులో పెట్రోల్ కొట్టించుకునేందుకు తెగ శ్రమించింది. చివరికి కార్య యజమాని చెప్పింది విని సిగ్గు పడిపోయి నాలుక కరుచుకుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.. అమెరికాలోని ఓ పట్టణంలో ఓ యువతి వాహనాలకు పెట్రోల్ పడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక టెస్లా కారు వచ్చి ఆగుతుంది. పక్కన ఉన్న యువతి నేరుగా అక్కడికి వచ్చి పంపు తీసుకొని వాహనానికి పెట్రోల్ పట్టాలని చూస్తుంది. పెట్రోల్ ట్యాంక్ ఎక్కడ ఉందో తెలియక ముందూ, వెనుకా వెతుకుతూ ఉంటుంది.. ఇదేంటి ఈ కారుకు పెట్రోల్ ఎలా పోయాలంటూ తెగ ఆలోచిస్తుంది.. పలుమార్లు కారు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.
అయితే ఆ యువతిని చూసిన పక్కన ఉన్న వాహనదారులు నవ్వుకుంటూ ఉంటారు. వారు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక ఆ యువతి అమాయకపు చూపులు చూస్తూ ఉంటుంది. చివరికి కారు యజమాని అక్కడికి వచ్చి ” ఇది ఎలక్ట్రిక్ కారు. దీనికి పెట్రోల్ తో పని ఉండదు” అని చెప్పడంతో ఆ యువతి నాలుక కరుచుకుంటుంది. అయితే ఆ సమీప ప్రాంతంలో ఉన్నవారు ఈ సంఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో మిలియన్ల కొద్ది వ్యూస్ దక్కించుకుంది.
— NO CONTEXT HUMANS (@HumansNoContext) May 6, 2023