https://oktelugu.com/

Viral Video: చిరుతతో సెల్ఫీ.. నీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ బ్రో.. వీడియో వైరల్

ఇన్ స్టా గ్రామ్ లో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో ప్రకారం.. ఓ రైతు పొలంలోకి చిరుత ప్రవేశించింది.. దీంతో ఆ విషయం తెలుసుకున్న అతడు అక్కడికి వెళ్ళాడు. అతడు వెళ్లే సమయానికి చిరుత పులి అక్కడే ఉంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 6, 2024 / 09:38 PM IST

    Viral Video

    Follow us on

    Viral Video: చురకత్తిలాంటి చూపు.. కోట్ల సుత్తి దెబ్బలతో సమానమైన పంజా. మ అంతకంటే పదునైన దంతాలు.. వాయు వేగంతో పరిగెత్తే కాళ్లు.. దాడి చేసిందా ఇక అంతే సంగతులు.. ఎదురు పడిందా బతుకు మీద ఆశ వదులుకోవాల్సిందే.. చిరుత పులి గురించి చెప్పాల్సి వస్తే పై ఉపోద్ఘాతం ఇంకా చిన్నదే అవుతుంది. అలాంటి చిరుత పులి ఎదురు పడితే ఏమైనా ఉందా.. చావును దగ్గరికి ఆహ్వానించినట్టే.. అయితే అలాంటి క్రూర ఓ వ్యక్తి సెల్ఫీ దిగాడు. చదువుతుంటే వెన్నులో వణుకు పుడుతుంది కదా.. ఈ కథనం చదివితే అంతకుమించి ఉంటుంది.

    ఇన్ స్టా గ్రామ్ లో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో ప్రకారం.. ఓ రైతు పొలంలోకి చిరుత ప్రవేశించింది.. దీంతో ఆ విషయం తెలుసుకున్న అతడు అక్కడికి వెళ్ళాడు. అతడు వెళ్లే సమయానికి చిరుత పులి అక్కడే ఉంది. దానిని చూసి పరుగులు పెట్టాల్సిన రైతు అక్కడే ఉన్నాడు. పైగా తన వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ లో దాంతో సెల్ఫీలు దిగాడు. అతడు సెల్ఫీలు దిగుతుంటే చిరుత పులి కూడా విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. రైతును చూసి పారిపోకుండా అది అక్కడే నిశ్శబ్దంగా కూర్చుంది. అతడు సెల్ఫీలు తీసుకుంటుంటే తోక ఆడిస్తూ ఫోజులు ఇచ్చింది. అయితే ఈ దృశ్యాన్ని దగ్గరున్న ఓ వ్యక్తి తన కెమెరాలు వీడియో తీశాడు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.. ఆ రైతు అలా సెల్ఫీలు దిగుతున్నప్పటికీ చిరుతపులి ఎటువంటి ప్రతిస్పందనకు దిగకపోవడం విశేషం.. సాధారణంగా ఏదైనా జంతువు వస్తే చిరుత పులి ఎదురు తిరుగుతుంది. తన పంజా దెబ్బ చూపించి చంపేస్తుంది. గొంతును నోట కరచుకొని పదునైన దంతాలతో చీల్చి చీల్చి తినేస్తుంది. అదేంటో గాని ఆ చిరుత పులి ఆ మనిషిని చూడగానే ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని ప్రదర్శించింది. మౌనముని లాగా మారిపోయింది.

    ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. సోషల్ మీడియాలో ఈ వీడియో సర్కులేట్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను లక్షల మంది చూశారు. ఆ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ రైతు చిరుతను ఒక ఆట ఆడుకున్నాడు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. రైతును చూసిన పులి షాక్ కు గురైందని.. భయపడకుండా సెల్ఫీలు దిగిందని కొందరు వ్యాఖ్యానించారు. పులిని చూసి భయపడకుండా వ్యవహరించి ఉండటంతో.. అదికూడా అలాగే బిత్తర పోయి కదలకుండా ఉండిపోయిందని మరికొంతమంది కామెంట్స్ చేశారు.. అతని అదృష్టం బాగుండి చిరుత పులి సైలెంట్ గా ఉందని.. అది ఒకవేళ ఎదురు తిరిగితే ప్రాణాలు పోయావని ఇంకొందరు వ్యాఖ్యానించారు. ఇలాంటి పనులు చేసి ప్రాణాలను క్రూరమృగాల చేతిలో పోగొట్టుకోవద్దని.. మరికొందరు హితవు పలికారు.