A period of decay ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవి గిట్టకమానదు. అయితే ఏ జీవి ఎప్పుడు ఆ మట్టిలో కలిసిపోతుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. తాజాగా యూకేకు చెందిన శాస్త్రవేత్తలు ఏ జీవి ఎంత సేపటికి కుళ్లిపోతుందన్న దానిపై సర్వే చేశారు. ఇందులో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. అవిప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. అందరూ అనుకుంటున్న మనిషి చనిపోగానే మూడోరోజే కుళ్లు కొడుతుంది. కానీ మానవుడు పూర్తిగా కుళ్లిపోవడానికి ఒక వారం రోజులు పడుతుందని తేలింది. ఇలానే కొన్ని వస్తువులు, పండ్లు ఫలాలు కూడా కుళ్లిపోయే టైం ను కూడా శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

అత్యధికంగా కుళ్లిపోకుండా ఉండే వస్తువు ఏంటో తెలుసా? ప్లాస్టిక్ సంచులు ఇవి 1000 సంవత్సరాల వరకూ చెక్కుచెదరకుండా భూమిపై ఉంటాయి. వీటి వల్లే భూమిపై కాలుష్యం పెరిగిపోతోంది.అందుకే పర్యావరణ హితం కోసం వాటిని వాడవద్దని.. నిషేధించాలని అందరూ అంటున్నారు.
మానవుడు — 1 వారం
పేపర్ టవల్ – 2-4 వారాలు
అరటి తొక్క – 3-4 వారాలు
పేపర్ బాగ్ – 1 నెల
వార్తాపత్రిక – 1.5 నెలలు
ఆపిల్ కోర్ – 2 నెలలు
కార్డ్బోర్డ్ – 2 నెలలు
కాటన్ గ్లోవ్ – 3 నెలలు
ఆరెంజ్ పీల్స్ – 6 నెలలు
ప్లైవుడ్ – 1-3 సంవత్సరాలు
ఉన్ని సాక్ – 1-5
సంవత్సరాలు
మిల్క్ కార్టన్లు – 5 సంవత్సరాలు
సిగరెట్ బట్స్ – 10-12 సంవత్సరాలు
తోలు బూట్లు – 25-40 సంవత్సరాలు
టిన్డ్ స్టీల్ క్యాన్ – 50 సంవత్సరాలు
ఫోమేడ్ ప్లాస్టిక్ కప్పులు – 50 సంవత్సరాలు
రబ్బరు-బూట్ ఏకైక – 50-80 సంవత్సరాలు
ప్లాస్టిక్ కంటైనర్లు – 50-80 సంవత్సరాలు
అల్యూమినియం కెన్ – 200-500 సంవత్సరాలు
ప్లాస్టిక్ సీసాలు – 450 సంవత్సరాలు
పునర్వినియోగపరచలేని డైపర్స్ – 550 సంవత్సరాలు
మోనోఫిలమెంట్ ఫిషింగ్ లైన్ 600 సంవత్సరాలు
ప్లాస్టిక్ సంచులు 200-1000 సంవత్సరాలు.
అందుకే అందరూ ప్లాస్టిక్ సంచులకు దూరంగా ఉంటేనే బెటర్ అని అందరూ సూచిస్తున్నారు. గ్లోబల్ గ్రీన్ హౌస్ ప్రభావానికి సంబంధించిన ప్రధాన కారణాలలో ప్లాస్టిక్ ఒకటి అని ప్రజలలో అవగాహన ఏర్పరచాలని అందరూ కోరుతున్నారు. హరిత పర్యావరణానికి మద్దతు ప్లాస్టిక్ నిషేధానికి అందరూ పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ప్లాస్టిక్ ను వాడడాన్ని మానేయడమే అందరి మార్గం..