Bhavadeeyudu Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వం లో అతి త్వరలోనే భవదీయుడు భగత్ సింగ్ చిత్రం అతి త్వరలోనే ప్రారంభం అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కాంబినేషన్ కావడం తో ఈ సినిమాని ప్రకటించిన రోజు నుండే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి..షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురు అవుతూ వస్తుంది..పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ మరియు హరి హర వీర మల్లు షూటింగ్ లో బిజీ గా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది..అయితే పవన్ కళ్యాణ్ అక్టోబర్ 5 వ తారీకు నుండి రాజకీయ యాత్ర చెయ్యబోతుండడం తో చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసేయాలి అని ఆలోచన లో ఉన్నట్టు తెలుస్తుంది..అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈ నెలాఖరున నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియా లో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది..అదేమిటి అంటే ఈ సినిమాలో విలన్ గా తమిళ హీరో విజయ్ సేతుపతి ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది..ఇప్పటికే ఆయన తో ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ చర్చలు జరపగా,ఈ సినిమాలో నటించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న సమాచారం..ఒక పక్క హీరో గా చేస్తూనే మరోపక్క వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ విలక్షణ నటుడిగా గొప్ప పేరు తెచ్చుకుంటూ ముందుకి దూసుకుపోతున్న విజయ్ సేతుపతి కి టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది..ఈయన విలన్ గా నటించిన మాస్టర్ మరియు విక్రమ్ రెండు సినిమాలకు కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఇప్పుడు తొలిసారి డైరెక్ట్ తెలుగు సినిమాలో..అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో విలన్ గా నటించబోతున్నాడు..ఈ సినిమా ద్వారా విజయ్ సేతుపతి టాలీవుడ్ లో వేరే లెవెల్ కి వెళ్ళిపొయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.