Sara Tendulkar: క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ గారాల పట్టి సారా టెండుల్కర్ సినిమారంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నటనపై ఆసక్తి కనబరుస్తున్న సారా ఇప్పటికే యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది. లండన్‌లో మెడిసిన పూర్తి చేసిన సారా సోషల్ మీడియాలో యాక్టింగా ఉంటుంది. ఇన్‌స్ట్రాగామ్ వేదికగా తరచూ తన ఫోటోలతో షేర్‌చేస్తూ పాపులారిటీని సంపాధించింది. కికెటర్ శుభ్‌మన్‌గిల్‌తో సారా లవ్‌లో ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా ఆమె బాలివుడ్ ఎంట్రీ వార్త ఇప్పుడు బీటౌన్‌లో హల్‌చల్ చేస్తోంది.

సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్..
సచిన్ టెండూల్కర్ ఆటతో అభిమానుల్ని సంపాదించుకుంటే.. సారా తన అందంతో, అందమైన ఫోటోలతో ఫ్యాన్స్ హృదయాలను కొల్లగొడుతోంది. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇన్‌స్ట్రాగామ్‌లో ఆమెకు 1.8 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికంటే ముందే సారా ఇంత క్రేజ్ సంపాదించుకోవడం విశేషం.
తొలుత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ..

సారా గతంలో నైట్‌డేట్ స్టోరీని ఇన్‌స్టాగ్రాంలో షేర్‌చేసి సంచలనం రేపింది. తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్‌పై మక్కువతో మోడలింగ్ రంగంలో ప్రవేశించింది. ఈ క్రమంలో ప్రముఖ దుస్తుల కంపెనీలో ఒప్పందం చేసుకుంది. ముంబైలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసిన తరువాత ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నుంచి మెడిసిన్ పూర్తి చేసింది. అయితే ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్ రంగాలపై మక్కువ పెంచుకుంది. ఆమె షేర్ చేసే వీడియోలు, ఫోటోలే ఇందుకు ఉదాహరణ. కొత్తగా మోడలింగ్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రముఖ దుస్తుల కంపెనీతో ఒప్పందం కుదుర్చుంది. ఈ కంపెనీ తీసిన వీడియోలో సారా టెండూల్కర్‌తో పాటు అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్యవర్మ, సర్ధార్ ఉద్దమ్ సింగ్ ఫేమ్ బనితాసిందు, తానియా ష్రాప్ ఉన్నారు. తాజాగా లిప్‌స్టిక్ యాడ్‌లోనూ నటనతో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు బాలివుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
త్వరలో హీరోయిన్‌గా..
త్వరలోనే సారా టెండూల్కర్ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సారా ఇప్పటికే పలు బ్రాండ్‌లకు ప్రచార కర్తగా ఉంది. ఆమె అందం, నటన ను చూసిన బాలివుడ్ దర్శకులు సినిమా ఆఫర్లు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.