Homeట్రెండింగ్ న్యూస్Taiwan Restaurant: ఏం తింటార్రా బాబూ.. తైవాన్ రెస్టారెంట్ లో మొసలి లెగ్ పీస్.. షాక్...

Taiwan Restaurant: ఏం తింటార్రా బాబూ.. తైవాన్ రెస్టారెంట్ లో మొసలి లెగ్ పీస్.. షాక్ లగా!

Taiwan Restaurant: చైనా.. తైవాన్‌.. ఈ రెండు దేశాల పేర్లు వినగానే మనకు గుర్తొచ్చే ఫుడ్స్‌ కప్పలు, పాములు, తేళ్ల భోజనం. ఇలా కాదేదీ తినడానికి అనర్హం అన్నట్లు ప్రతీ జంతువును వండుకు తినడం అక్కడివారికి అలవాటే. ఏ జంతువును తినాలనిపించినా.. వాటిని కట్‌చేసి నాలుగైదు రకాల మసాలాలు దట్టించి.. పెనంపై హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసి కొన్ని.. సూప్‌ చేసి కొన్ని.. నూడుల్స్‌తో కలిపి కొన్ని జంతువులను లాగించేస్తారు. అన్ని జంతువులను చైనీయులు, తైవాన్‌ వాసులు సమభావంతో చూస్తారు.

మొసలి లెగ్‌పీస్‌ పూప్‌..
థైవాన్‌కు చెందిన విచ్‌క్యాట్‌ అనే రెస్టారెంట్‌ యజమానికి రోజూ రోటీన్‌ ఫుడ్‌ చేస్తే మజా ఏంటుంటుందనుకున్నట్లు ఉన్నాడు. వెరైటీగా ఏదైనా ట్రై చేద్దామని ఇటీవల మొసలి లెగ్‌పీస్‌తో సూప్‌ తయారు చేశాడు. ఆ రెస్టారెంట్‌ చెఫ్‌లకు క్రియేటివిటీ కూడా కాస్త ఎక్కువగా ఉన్నట్లు ఉంది. ఎప్పుడూ చికెన్‌ లెగ్‌పీస్‌ వండితే కొత్తగా ఏముంటుంది అనుకున్నారు.. యజమాని ఆర్డర్‌ చేయగానే చెఫ్‌లు వెరైటీ వంటకం తయారీకి సిద్ధమయ్యారు. మొసలిని కట్‌చేసి.. ఇలా సూప్‌ పెట్టి మసాలాలు దట్టించి అందంగా కనిపించేలా నూడుల్స్, ఉడకబెట్టిన పులుసుతో కూడిన గిన్నెపై మొసలి కాలుతో కూడిన విచిత్రమైన వంటకాన్ని పరిచయం చేసింది. వంటకం తయారు చేశారు. దీనికి గాడ్జిల్లా రామెన్‌ సూప్‌ అని పేరు పెట్టారు. దీని తయారీకి 1,500 తైవాన్‌ డాలర్లు ఖర్చు పెట్టారట.

తింటే రొమాంటిక్‌ ఫీలింగ్స్‌..
అయితే ఇంత కష్టపడి చేసిన ఈ గాడ్జిల్లా రామెన్‌ సూప్‌ తినేందుకు అక్కడి వారు సాహసం చేయడం లేదు. రెస్టారెంట్‌కు వస్తున్నవారు దానిని చూసి వెళ్తున్నారు తప్ప టేస్ట్‌ చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు. కొంతమంది ఫొటోలు దిగుతున్నారు. దీంతో రెస్టారెంట్‌ యజమాని మరో కొత్త విషయం చెబుతున్నాడు. దీనిని తినడం ద్వారా రొమాంటిక్‌ ఫీలింగ్స్‌ కూడా వస్తాయని అంటున్నాడు. ఇలా చెబితే అయినా వంటకం టేస్ట్‌ చేస్తాడని అనుకున్నాడో.. లేక నిజంగా వస్తాయో తెలియదు కానీ.. ప్రచారం మాత్రం చేస్తున్నాడు.

అన్ని జంతువులను లొట్టలు వేసుకుంటూ లాగించే చైనా, తైవాన్‌ వాసులు ఈ మొసలి లెక్‌పీస్‌ వంటకం రుచి చూడడానికి మాత్రం జంకుతున్నట్లు కనిపిస్తోంది. మరి దీనిని తినేందుకు ఎవరైనా ముందుకు వస్తారో.. లేక రెస్టారెంట్‌ యజమాని, చెఫ్‌లు చేసిన ప్రయోగం విఫలం అవుతుందో చూడాలి. తైవాన్‌ న్యూస్‌ ప్రకారం, సోషల్‌ మీడియా కోసం గాడ్జిల్లా రామెన్‌ పూప్‌ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version