Flying Car: ప్రజల అవసరాల దృష్ట్యా నేటి కాలంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక వాహనం ఉంటుంది. కాస్త బడ్జెట్ ఉన్నవారు కారును కొనుగోలు చేస్తున్నారు. దీంతో రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్ ఏర్పడుతోంది. నగరాల్లో, పట్టణాల్లో వాహనాలపై ప్రయాణించాలంటే కష్టతరమైన పని. ట్రాఫిక్ ఇబ్బందులను తీర్చడానికి రోడ్లపై ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికన్ ఇంజనీర్లు బాగా ఆలోచించి.. రోడ్లపై వెళ్తే.. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు గాల్లోకి లేపే కార్లను తయారు చేశారు. వీటిని ఇప్పటి వరకు సినిమాల్లోనే చూశాం. కానీ ఇప్పుడు రియల్ గా రోడ్లపై తిరుగుతూ.. గాల్లోకి ఎగరనున్నాయి. మరి కార్ల విశేషాలేంటో తెలుసుకుందామా..
అమెరికాకు చెందిన అలెఫ్ అనే కంపెనీ ఫ్లయింగ్ కారును అభివృద్ధి చేస్తున్నారు. ఆ కంపెనీ వెబ్ సైట్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలిఫోర్నియాలోని శాన్ మాటియో కేంద్రంగా ఈ ఫ్లయింగ్ కారు అభివృద్ధి చెందుతోంది. ఇందులో ఒకరు లేదా ఇద్దరు ప్రయాణించవచ్చు. రోడ్లపై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురైతే గాల్లోకి ఎగరాలనుకుంటే వెంటనే దానికి సంబంధించిన బటన్ ప్రెస్ చేస్తే చాలు.. విమానంలా కారు పైకి లేచి మనం సెట్ చేసిన గమ్యానికి వెళ్తుంది.
2022 అక్టోబర్ లో వర్కింగ్ ఫుల్ సైజ్ టెక్నాలజీ డెమోన్ స్ట్రేటర్లు ఈ కారును ఆవిష్కరించారు. ఫుల్ స్పోర్ట్స్ తరహాలో ఉన్న ఈ కారును 2025 నాటికి అభివృద్ధి చేస్తామని అలెఫ్ కంపెనీ సీఈవో జిమ్ దుఖోవ్నీ తెలిపారు. చరిత్రలోనే మొట్టమొదటి ఎగిరే కారును తాము తయారు చేయాలనుకున్నామని, త్వరలోనే లక్ష్యాన్ని చేరుతామని ఆయన అన్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ముందస్తు ఆర్డర్లు వచ్చాయని, మార్కెట్ సామర్థ్యాన్ని భట్టి కార్లను ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు.
అయితే ఈ కారుల మిగతా కార్లలాగా స్పీడ్ ఉండదు. గంటకు 25 మైళ్లకు మించి వెళ్లదు. అయితే ఇన్ టైంలో గమ్యాన్ని చేరుకోవాలటే వెంటనే ఫ్లయింగ్ మోడ్ ను ఎంచుకోవాలి. ఇక దీనిని ఎక్కడైనా కార్ల పక్కనే పార్క్ చేసుకోవచ్చు. గ్రామీణ రోడ్లపై కూడా నడిచేలా సెట్ చేస్తున్నామని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. ఇక ఈ కారు ధర సుమారు రూ.3 లక్షల డాలర్లు. ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.2.5 కోట్లు ఉండొచ్చిని అంటున్నారు.