Taiwan Restaurant: చైనా.. తైవాన్.. ఈ రెండు దేశాల పేర్లు వినగానే మనకు గుర్తొచ్చే ఫుడ్స్ కప్పలు, పాములు, తేళ్ల భోజనం. ఇలా కాదేదీ తినడానికి అనర్హం అన్నట్లు ప్రతీ జంతువును వండుకు తినడం అక్కడివారికి అలవాటే. ఏ జంతువును తినాలనిపించినా.. వాటిని కట్‌చేసి నాలుగైదు రకాల మసాలాలు దట్టించి.. పెనంపై హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసి కొన్ని.. సూప్ చేసి కొన్ని.. నూడుల్స్‌తో కలిపి కొన్ని జంతువులను లాగించేస్తారు. అన్ని జంతువులను చైనీయులు, తైవాన్ వాసులు సమభావంతో చూస్తారు.
మొసలి లెగ్‌పీస్ పూప్..
థైవాన్‌కు చెందిన విచ్‌క్యాట్ అనే రెస్టారెంట్ యజమానికి రోజూ రోటీన్ ఫుడ్ చేస్తే మజా ఏంటుంటుందనుకున్నట్లు ఉన్నాడు. వెరైటీగా ఏదైనా ట్రై చేద్దామని ఇటీవల మొసలి లెగ్‌పీస్‌తో సూప్ తయారు చేశాడు. ఆ రెస్టారెంట్ చెఫ్‌లకు క్రియేటివిటీ కూడా కాస్త ఎక్కువగా ఉన్నట్లు ఉంది. ఎప్పుడూ చికెన్ లెగ్‌పీస్ వండితే కొత్తగా ఏముంటుంది అనుకున్నారు.. యజమాని ఆర్డర్ చేయగానే చెఫ్‌లు వెరైటీ వంటకం తయారీకి సిద్ధమయ్యారు. మొసలిని కట్‌చేసి.. ఇలా సూప్ పెట్టి మసాలాలు దట్టించి అందంగా కనిపించేలా నూడుల్స్, ఉడకబెట్టిన పులుసుతో కూడిన గిన్నెపై మొసలి కాలుతో కూడిన విచిత్రమైన వంటకాన్ని పరిచయం చేసింది. వంటకం తయారు చేశారు. దీనికి గాడ్జిల్లా రామెన్ సూప్ అని పేరు పెట్టారు. దీని తయారీకి 1,500 తైవాన్ డాలర్లు ఖర్చు పెట్టారట.
తింటే రొమాంటిక్ ఫీలింగ్స్..
అయితే ఇంత కష్టపడి చేసిన ఈ గాడ్జిల్లా రామెన్ సూప్ తినేందుకు అక్కడి వారు సాహసం చేయడం లేదు. రెస్టారెంట్‌కు వస్తున్నవారు దానిని చూసి వెళ్తున్నారు తప్ప టేస్ట్ చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు. కొంతమంది ఫొటోలు దిగుతున్నారు. దీంతో రెస్టారెంట్ యజమాని మరో కొత్త విషయం చెబుతున్నాడు. దీనిని తినడం ద్వారా రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా వస్తాయని అంటున్నాడు. ఇలా చెబితే అయినా వంటకం టేస్ట్ చేస్తాడని అనుకున్నాడో.. లేక నిజంగా వస్తాయో తెలియదు కానీ.. ప్రచారం మాత్రం చేస్తున్నాడు.
అన్ని జంతువులను లొట్టలు వేసుకుంటూ లాగించే చైనా, తైవాన్ వాసులు ఈ మొసలి లెక్‌పీస్ వంటకం రుచి చూడడానికి మాత్రం జంకుతున్నట్లు కనిపిస్తోంది. మరి దీనిని తినేందుకు ఎవరైనా ముందుకు వస్తారో.. లేక రెస్టారెంట్ యజమాని, చెఫ్‌లు చేసిన ప్రయోగం విఫలం అవుతుందో చూడాలి. తైవాన్ న్యూస్ ప్రకారం, సోషల్ మీడియా కోసం గాడ్జిల్లా రామెన్ పూప్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.