Navratri 2022 Gujarat: మనదేశంలో ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. విభిన్న జాతుల కలయిక.. విభిన్న మతాల కలబోత అందుకే భిన్నత్వంలో ఏకత్వం అన్నారు. ఎన్ని మతాలు, జాతులు, కులాలు ఉన్నా దేశమంతా ఒక్కటే అనే నినాదమే అందరికి ఆయువు పట్టులా ఉంటుంది. మన దేశాన్ని ఏ శక్తులు కూడా ఏం చేయలేకపోవడానికి కారణం అదే. మన దేశంలో ఎన్నో ప్రాంతాలున్నాయి. అందులో వింతైన ఆచారాలు ఉన్నట్లు తెలిసిందే. ఆచారాలకు, సంప్రదాయాలకు పెట్టింది పేరు. దీంతో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచారం మనకు కనిపిస్తూనే ఉంటుంది.

200 ఏళ్లుగా గుజరాత్ లోని వడోదర, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ఓ వింతైన ఆచారం ఉంది. దేవీ నవరాత్రోత్సవాల్లో పురుషులు చీరలు కట్టుకుని నృత్యం చేస్తారు. ఇలా చేస్తే వారి కోరికలు తీరుతాయని వారి నమ్మకం. అందుకే అక్కడి వారు ఈ ఆచారాన్ని నమ్ముతున్నారు. అమ్మవారు కనికరిస్తుందని మగవారందరు చీరలు కట్టుకుని డ్యాన్స్ చేయడం వారి ప్రత్యేకత. తరతరాలుగా వస్తున్న ఆచారం కావడంతో ఎవరు కాదనలేకపోతున్నారు. దేవి అనుగ్రహం కోసం తప్పదని భావించి చీర కట్టుకుని చిందులేస్తున్నారు.
బరోట్ జాతి వారు తమ శాప విమోచనం కోసం ఇలా వేషధారణ చేస్తారని తెలుస్తోంది. అమ్మవారి అనుగ్రహం కోసమే పురుషులు చీరలు ధరించి ఆడటం ఓ ఆచారంగా వస్తోంది. దీంతో వారి విశ్వాసం మేరకే వారు ఇలా చేస్తున్నారు. దీంతో వారికి మంచి జరుగుతుందో లేదో కానీ వారి డ్యాన్సులను చూడటానికి మాత్రం జనం ఎగబడి వస్తారు. అమ్మవారి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఇలా చేస్తున్నారు. దీంతో వారు అమ్మవారి దీవెనల కోసమే ఇలా చేస్తున్నారని చెబుతున్నారు.

దేశంలో ఉన్న పలు రకాల ఆచారాలనుచూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలోనే వారి విశ్వాసం మేరకే నడుచుకుంటారు. గుజరాత్ లో కూడా ఇలా అమ్మవారి ముందు మగవారు స్త్రీల వేషధారణలో నృత్యం చేయడం వారి ఆచారంలో భాగమే. అమ్మవారు తమ కోరికలు తీరుస్తుందనే ఉద్దేశంతోనే వారంతా చీరలు ధరించి నృత్యాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి అక్కడ ఉన్న ఆచారంతో వారు అలా చేయడం కొత్తేమీ కాదు. వారి విశ్వాసంతోనే అమ్మవారి ముందు స్త్రీ వేషధారణలో నృత్యం చేస్తున్నారు