Fehmarn Belt: సముద్రగర్భంలో సొరంగం: ప్రపంచంలోనే అతిపెద్దది.. ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసా?

Fehmarn Belt: వస్తువును ఉత్పత్తి చేయడం ఒక టాస్క్ అయితే… దాని నిర్ణీత సమయానికి రవాణా చేయడం అనేది మరింత పెద్ద టాస్క్. రోడ్డు రవాణా చాలా సమయం పడుతుంది. విమానాల ద్వారా రవాణా చాలా ఖర్చుతో కూడుకున్నది. సముద్ర మార్గంలో రవాణా చాలా ఇబ్బందులతో కూడుకున్నది. ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా సముద్ర గర్భంలో ఒక సొరంగాన్ని తవ్వి ప్రత్యేక రవాణా మార్గాన్ని నిర్మిస్తే ఎలా […]

Written By: Bhaskar, Updated On : September 27, 2022 12:35 pm
Follow us on

Fehmarn Belt: వస్తువును ఉత్పత్తి చేయడం ఒక టాస్క్ అయితే… దాని నిర్ణీత సమయానికి రవాణా చేయడం అనేది మరింత పెద్ద టాస్క్. రోడ్డు రవాణా చాలా సమయం పడుతుంది. విమానాల ద్వారా రవాణా చాలా ఖర్చుతో కూడుకున్నది. సముద్ర మార్గంలో రవాణా చాలా ఇబ్బందులతో కూడుకున్నది. ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా సముద్ర గర్భంలో ఒక సొరంగాన్ని తవ్వి ప్రత్యేక రవాణా మార్గాన్ని నిర్మిస్తే ఎలా ఉంటుంది? చదువుతుంటే ఏదో హాలీవుడ్ సినిమాల గా అనిపిస్తుంది కదా.. కానీ దీనిని నిజం చేసేందుకు డెన్మార్క్, జర్మనీ కంకణం కట్టుకున్నాయి. ఈ జలాంతర సొరంగానికి ఫెహ్ మార్న్ బెల్ట్ అని పేరు పెట్టాయి.

Fehmarn Belt

– ఎందుకు ఈ నిర్మాణం అంటే

ముందుగానే చెప్పినట్టు సరుకులను ఎంత త్వరగా రవాణా చేస్తే అంత విదేశీ మారకద్రవ్యం లభిస్తుంది. ఈ విషయాన్ని గుర్తించే చైనా ముందుగానే శ్రీలంకలో ప్రత్యేక పోర్టు నియమించింది. భారత్ చైనా సరిహద్దుల్లో ఈశాన్య రాష్ట్రాల పరిధిలో చికెన్ నెక్ పేరుతో రోడ్లు నిర్మించింది. ఒకవేళ సముద్ర మార్గంలో ఏవైనా అవాంతరాలు ఏర్పడితే తక్కువ ఖర్చుతో రోడ్డు మార్గం ద్వారా సరుకు రవాణా చేయొచ్చు అనేది చైనా ప్లాన్. అందుకే మౌలిక రంగంలో, తయారీ చైనా దేశాన్ని కొట్టే దేశం మరొకటి లేదు. ఈ క్రమంలోనే తాము కూడా చైనా లాగే రవాణా వ్యవస్థను మరింత ఆధుని కీకరించాలని జర్మనీ, డెన్మార్క్ దేశాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా 2008లో ఒక సొరంగాన్ని నిర్మించాలని ఒప్పందం చేసుకున్నాయి. దీనివల్ల సరుకు రవాణా అనేది సులభం అవుతుందని ఆ దేశాల అంచనా..

Also Read: CM KCR- National Party: ‘పీఎం’ ఎప్పుడవుతవ్ కేసీఆర్ సారూ!

– దశాబ్దం తర్వాత మొదలయ్యాయి

2008లో ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేసినప్పటికీ అది అమల్లోకి రావడానికి దశాబ్దం పట్టింది. మీడియా నివేదిక ప్రకారం రోజూ 2,500 మంది వ్యక్తులు ఈ సొరంగ నిర్మాణంలో పనిచేస్తున్నారు. 18 కిలోమీటర్ల పొడవుతో ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. ఈ సొరంగం స్వీడన్, మధ్య యూరప్ దేశాల మధ్య కొత్త భూ మార్గాన్ని సృష్టించనుంది. ఈ సొరంగం నిర్మాణానికి ఏడు బిలియన్ యూరోలను ఖర్చు చేస్తున్నారు. సముద్ర మార్గంలో సొరంగం నిర్మిస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మానవ అస్తిపంజరం నమూనా మాదిరి నిర్మిస్తున్నారు. సొరంగం కోసం జరుపుతున్న తవ్వకాల లో భాగంగా 18 మిలియన్ క్యూబిక్ మీటర్ల మట్టి, ఇసుక, రాళ్లు వెలికి తీస్తున్నారు. వీటి ద్వారా బీచ్ లను నిర్మించనున్నారు. ఇతర నిర్మాణ పనులకు కూడా వాటిని ఉపయోగిస్తారు.

Fehmarn Belt

– కొత్త ప్రదేశాలు ఏర్పడే అవకాశం

ఫెహ్ మార్న్ బెల్ట్ సొరంగం వల్ల డానిష్, జర్మనీ వైపు కొత్త సహజ ప్రాంతాలు, రాతి దిబ్బలు ఏర్పడతాయని ఇరుదేశాల అధినేతలు చెబుతున్నారు. సొరంగం తవ్వడం వల్ల ఏర్పడే ఖాళీ ప్రదేశంలో సరికొత్త జీవులు ఉద్భవిస్తాయని వారు నమ్ముతున్నారు. ఈ సొరంగాన్ని ఏనుగుతో పోల్చుతున్న ఇరుదేశాల అధికారులు.. అదే స్థాయిలో బలంగా నిర్మిస్తున్నామని చెబుతున్నారు. సునామీలు, సముద్రంలో తుఫాన్లు ఏర్పడినప్పుడు ఏమాత్రం చెక్కుచెదరకుండా ఉండేందుకు నాణ్యమైన ఉక్కును వాడుతున్నారు. 217 మీటర్ల పొడవు, 42 మీటర్ల వెడల్పుతో ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఫెహ్‌మార్న్‌బెల్ట్ ప్రపంచంలోనే పొడవైన రహదారి, రైలు సొరంగం. ఇది డబుల్ లేన్ మోటర్‌వే, రెండు ఎలక్ట్రిక్ రైల్ ట్రాక్‌లను కలిగి ఉంటుంది. 2029 లో ఇది అందుబాటులోకి వస్తుంది. ఈ నిర్మాణం గనుక పూర్తి అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగంగా రికార్డులకు ఎక్కుతుంది టన్నెల్ పూర్తయిన తర్వాత రాడ్‌బైహావ్న్ , పుట్ గార్డెన్ మధ్య ప్రయాణం రైలు ద్వారా 7 నిమిషాలు మాత్రమే పడుతుందని అధికారులు భావిస్తున్నారు. కారులో అయితే 10 నిమిషాల్లో చేరుకోవచ్చని చెబుతున్నారు. అయితే మౌలిక వసతుల కల్పనలో ప్రపంచానికి చైనా కొత్త పాఠం చెబితే.. దానిని ఈ సొరంగం నిర్మాణం ద్వారా డెన్మార్క్, జర్మనీ దేశాలు మించిపోయేలా ఉన్నాయి. ఈ సొరంగం ద్వారా తమ దేశంలో తయారైన ఉత్పత్తులను ఇతర దేశాలకు రవాణా చేసేందుకు మార్గం సుగమమం అవుతుందని ఆ దేశాధినేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.

Also Read: TDP- Jana Sena: పెరుగుతున్న జనసేన గ్రాఫ్.. ఓటు షేర్ పై టీడీపీలో కలవరం

Tags