Homeఆంధ్రప్రదేశ్‌Ambati Rambabu Dance: బాలయ్యకు సిగ్గులేదన్న అంబటి,, ఆయన పాటకు ఎలా ఎగిరేరో చూడండి... ఇప్పుడు...

Ambati Rambabu Dance: బాలయ్యకు సిగ్గులేదన్న అంబటి,, ఆయన పాటకు ఎలా ఎగిరేరో చూడండి… ఇప్పుడు ఎవరికి లేదు?

Ambati Rambabu Dance: అంబటి రాంబాబు.. ఈ పేరులోనే ఫైర్ ఉంది. ప్రత్యర్థులపై విరుచుకుపడే తత్వం ఆయన సొంతం. అదే ఆయనకు ఇంత ఇమేజ్ తెచ్చిపెట్టింది. అమాత్య పదవి దక్కేలా చేసింది. అయితే ఆయన నిత్య వివాదాస్పద వ్యక్తి అన్న ముద్ర అయితే ఉంది. కానీ ఆయన కొనసాగుతున్నది వైసీపీలో కాబట్టి అటువంటివి అక్కడ కామన్. క్రమశిక్షణ అనేది కింది స్థాయి వ్యక్తులకే తప్ప అంబటిలాంటి పెద్దవారికి చెల్లదని ఇప్పటికే థర్టీ ఇయర్స్ పృధ్వీ ఉదాంతంతో తేలిపోయింది. ఫోన్ లో అసభ్యకరంగా మాట్లాడారని పృధ్వీపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారే కానీ.. అంతకంటే తీవ్ర స్థాయిలో అంబటిపై వచ్చినా టచ్ చేయలేకపోయారు. దటీజ్ అంబటి. ఆయన ఏదీ చేసినా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా కొంగొత్తగా క్రాఫ్ మార్చారు. కాస్తా తెల్లబడిన వెంట్రుకలతో, తెల్లటి దుస్తులతో అసలు సిసలు రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నారు. కొన్ని నెలల కిందట ఓ యూట్యూబ్ యాంకర్ ఇంటర్వ్యూ అడిగితే తిరిగి ఏమిస్తావని ప్రశ్నించడం ద్వారా అంబటి భలే పాపులర్ అయ్యారు.

Ambati Rambabu Dance
Ambati Rambabu

తాజాగా ఆయన ఓ సినిమా థియేటర్ లో అభిమానుల మధ్య బాలయ్య పాటకు స్టెప్పులేశారు. అడ్డదిడ్డంగా మాస్ డ్యాన్స్ చేస్తూ ఫ్యాన్స్ కు భలే కిక్కు ఇచ్చారు. వయ్యారాలు వొలకబోస్తూ మరీ డ్యాన్స్ చేశారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి హుందాగా ఉండాల్సింది పోయి ఇలా డ్యాన్స్ చేయడం ఏమిటని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు.అంబటి అభిమానులు మాత్రం డ్యాన్స్ వేస్తే తప్పేముందని.. మంత్రి అయితే డ్యాన్స్ వేయకూడదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే అన్నీ మరిచి బాలయ్య పాటకు స్టెప్పులు వేయడం విశేషం. కానీ డ్యాన్స్ వరకూ అధిష్టానం పట్టించుకోదు. ఎందుకంటే అంబటిపై అంతకంటే ఎక్కువే వివాదాలు వచ్చాయి, నాడు పట్టించుకోకపోతే నేడు ఎలా పట్టించుకుంటారు. కాదూ, కూడదు అంటే మరే హీరో దొరకలేదా? బాలయ్య పాటనే ఎందుకు ఎంచుకున్నావు అని మందలిస్తారు తప్ప.. అంబటిపై క్రమశిక్షణ చర్యలు అంటే ఉత్తమాటే.

Ambati Rambabu Dance
Ambati Rambabu

అయితే బాలక్రిష్ణ పాటకు ఫిదా అయి డ్యాన్స్ చేసిన అంబటి.. అదే బాలయ్యపై విరుచుకుపడ్డారు. హెల్త్ యూనివర్సిటీ మార్పు విషయంలో బాలయ్య రియాక్షన్ చూసిన అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలయ్యకు సిగ్గులేదు అంటూ కామెంట్స్ చేశారు. రాత్రికి అభిమానం చూపి.. తెల్లవారున ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటికి నెట్టింట ప్రశ్నలు, నిలదీతలు ఎదురవుతున్నాయి. అయితే పనిలో పనిగా అంబటి చంద్రబాబుకు బుద్ధిలేదు.. బాలయ్యకు సిగ్గు లేదు…లోకేష్ కి బుర్రే లేదంటూ కామెంట్స్ పెట్టడం దుమారం రేపుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version