Microsoft Employee: ఆటో నడుపుతున్న మైక్రోసాఫ్ట్ ఉద్యోగి.. కారణం తెలిస్తే అవాక్కవుతారు

సాప్ట్ వేర్ జాబ్ పైకి చూడ్డానికి బాగానే కనిపిస్తుంది. కానీ చేసేవాళ్లకు తెలుసు అందులో ఎంత కష్టం ఉంటోంది. వారానికి 5 రోజుల పనిదినాలే. కానీ ఈ5 రోజులు ఒక నరకంలా ఉంటుందని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. సాధారణ ఉద్యోగులు రోజుకు కనీసం 8 నుంచి 9 గంటలు పనిచేస్తే సాప్ట్ వేర్ ఉద్యోగులు 14 గంటలు పనిచేయాల్సి ఉంటుంది.

Written By: Chai Muchhata, Updated On : July 23, 2024 12:50 pm

Microsoft Employee

Follow us on

Microsoft Employee: Software జాబ్ అంటే చాలా మంది గోల్డెన్ ఛాన్స్ గా భావిస్తారు. భారీగా జీతాలు, అనువైన సౌకర్యాలు వారంతపు సెలవులతో పాటు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఈ రంగంలో ఉంటాయి. ప్రతిభ ఉంటే ఒక కంపెనీకి సీఈవో స్థాయికి ఎదిగేందుకు ఈ రంగం సహకరిస్తుంది. అందుకే చాలా మంది సాఫ్ట్ వేర్ జాబ్ పొందడమే లక్ష్యంగా కోర్సులు చేస్తుంటారు. ఒకప్పుడు సాఫ్ట్ వేర్ జాబ్ చేసే కుర్రాళ్లకు ఫుల్ డిమాండ్ ఉండేది. వీరికి లక్షల్లో జీతం ఉంటుంది కాబట్టి తమ కూతురు లైఫ్ భాగుంటుందని ఒకప్పుడు అనుకునేవారు. అయితే ఈ రంగంలోకి చాలా మంది ఎంట్రీ ఇవ్వడంతో టెకీలకు డిమాండ్ తగ్గుతూ వస్తోంది. మజ్జిగలో నీళ్లు ఎక్కువైతే పలచ బడ్డట్లు చాలా మంది సాప్ట్ వేర్ రంగం వైపు వెళ్లడంతో కొన్ని కంపెనీలు ఉద్యోగులను భరించలేక కోత విధిస్తున్నాయి. దీంతో కొందరు ముందు జాగ్రత్తగా సాప్ట్ వేర్ రంగం వైపు కాకుండా మిగతా వాటి వైపు దృష్టి పెడుతున్నారు. లేటేస్టుగా ఐటీ సెక్టార్ కు హబ్ గా ఉన్న బెంగుళూరు సిటీలో సాప్ట్ వేర్ ఉద్యోగులపై తీవ్ర చర్చ సాగుతోంది. అక్కడి ప్రభుత్వం సాప్ట్ వేర్ ఉద్యోగులు కనీస పనిగంటపై నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగ సంఘాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. అయితే తాజాగ మైక్రోసాప్ట్ లో పనిచేసే ఓ ఉద్యోగి ఆటో నడుపుతూ కనిపించాడు. తనకు సంబంధించిన ఫొటోను ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ పిక్ పై ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతోంది. ఇంతకీ ఆ టెకీ ఆటో నడపడానికి కారణం ఏంటి? అసలేం జరిగింది?

సాప్ట్ వేర్ జాబ్ పైకి చూడ్డానికి బాగానే కనిపిస్తుంది. కానీ చేసేవాళ్లకు తెలుసు అందులో ఎంత కష్టం ఉంటోంది. వారానికి 5 రోజుల పనిదినాలే. కానీ ఈ5 రోజులు ఒక నరకంలా ఉంటుందని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. సాధారణ ఉద్యోగులు రోజుకు కనీసం 8 నుంచి 9 గంటలు పనిచేస్తే సాప్ట్ వేర్ ఉద్యోగులు 14 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అందులోనూ ఇప్పుడు కొత్తగా 17 గంటలు పనిచేయాలనే రూల్స్ తీసుకురాబోతున్నారు. అయితే ఇప్పటికే సాప్ట్ వేర్ జాబ్ చేసే వాళ్లు వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఇప్పుుడు పనిగంటలు పెంచితే కష్టమవుతుందని అంటున్నారు.

ఇదే సమయంలో బెంగుళూరులో పనిచేసే ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి ఆటో నడుపుతూ కనిపించాడు. అతడు మైక్రోసాప్ట్ హుడీ ధరించాడు. అయితే ఈ ఆటోటో కూర్చున్న వెంకటేష్ గుప్తా అనే ప్రయాణికుడు ఈ పిక్ ను తీసిన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ సందర్భంగా అతడిని వివరాలు అడగ్గా.. అతను కోరమంగళకు చెందిన సాప్ట్ వేర్ ఇంజిన్ అని చెప్పాడన్నారు. అయితే ఆటో ఎందుకు నడపాల్సి వచ్చిందని అడిగితే.. వారాంతంల ఒంటరితనంతో బాధపడుతున్నానని, ఆ సమస్య లేకుండా ఉండడానికి ఆటో నడుపుతున్నట్లు పేర్కొన్నాడు. ఆటో నడపడం వల్ల అందరికతో కమ్యూనికేట్ గా ఉండొచ్చని పేర్కొన్నట్లు వెంకటేశ్ గుప్తా తన ఎక్స్ ఖతాలో వివరించాడు.

అయితే ఓ వైపు బెంగుళూరు సాప్ట్ వేర్ ఉద్యోగులపై చర్చ సాగుతుండగా.. ఇదే సమయంలో ఓ టెకీ ఇలా ఆటో నడపడం ఆసక్తిగా మారింది. చాలా మంది ఈ పిక్ చూడగానే ముందుగా సాప్ట్ వేర్ జాబ్ నచ్చకనే ఆటోనడుపుతున్నారని అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. వాస్తవానికి సాప్ట్ వేర్ జాబ్ చేసేవాళ్లు ఇంట్లో వాళ్లతో కమ్యూనికేషన్ తక్కువగా కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో కొందరు వారాంతంలో కుటుంబ సభ్యులను కలుస్తూ ఉంటారు. మరికొందరు తమ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నారు.