UP Police Officer: హోటల్ లో మహిళ కానిస్టేబుల్ తో దొరికిన డీఎస్పీ .. దెబ్బకు బొమ్మ చూపించిన పోలీస్ శాఖ

ఉత్తరప్రదేశ్ లోని లఖ్ నవూకి చెందిన క్రిపా శంకర్ కనౌజియా కానిస్టేబుల్ స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ డిఎస్పి స్థాయికి చేరుకున్నాడు. ఓ సాధారణ కుటుంబం నుంచి ఎదిగాడు.

Written By: Dharma, Updated On : June 23, 2024 2:26 pm

UP Police Officer

Follow us on

UP Police Officer: ఎవరైనా పదోన్నతితో ఉన్నత ఉద్యోగాన్ని అందుకుంటారు. కానీ ఆ డీఎస్పీ చేసిన తప్పిదంతో ఏకంగా కానిస్టేబుల్ స్థాయికి దిగజారి పోయారు. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ గా డెమోషన్ అయ్యారు. వినడానికి వింతగా ఉంది కదా. ఇంతకీ ఆయన చేసిన తప్పిదం ఏంటంటే ఓ మహిళ కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే. ఇంటి సమస్యల పేరు చెప్పి.. ఉద్యోగానికి సెలవు పెట్టి.. మహిళా కానిస్టేబుల్ తో ఓ హోటల్ లో దుకాణం పెట్టేశాడు. భార్య ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగు చూడడంతో పోలీస్ శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. కానిస్టేబుల్ గా డి మోషన్ ఇచ్చింది.

ఉత్తరప్రదేశ్ లోని లఖ్ నవూకి చెందిన క్రిపా శంకర్ కనౌజియా కానిస్టేబుల్ స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ డిఎస్పి స్థాయికి చేరుకున్నాడు. ఓ సాధారణ కుటుంబం నుంచి ఎదిగాడు. అయితే మూడేళ్ల కిందట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉండేటప్పుడు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. కుటుంబ కారణాలు చెప్పి ఎస్పీ అనుమతితో సెలవు తీసుకున్నాడు. కానీ ఇంటికి వెళ్లకుండా ఓ మహిళా కానిస్టేబుల్ తో కలిసి కాన్పూర్ లోని ఓ హోటల్ లో దిగాడు. తన వద్ద ఉన్న ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశాడు. అయితే ఆయన ఆచూకీ లేకపోవడంతో భార్య ఆందోళనకు గురైంది. వెంటనే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అయితే కుటుంబ కారణాలతోనే సెలవు తీసుకున్నాడని చెప్పగా భార్య అటువంటిదేమీ లేదని తెలిపింది.

ఒక సీఐ స్థాయి అధికారి కావడంతో.. దీని వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాలని యూపీ పోలీసులు డిసైడ్ అయ్యారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. అతను చివరిగా మాట్లాడిన ఫోన్ లొకేషన్ కాన్పూర్ లోని హోటల్ గా గుర్తించారు. అక్కడకు వెళ్లి ఆరా తీయగా మహిళా కానిస్టేబుల్ తో ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. అటు కుటుంబంతో పాటు ఇటు సొంత పోలీస్ శాఖను మోసం చేసినందుకు రేంజ్ ఐజిపి విచారణకు ఆదేశించారు. క్రమశిక్షణ రాహిత్యం కింద కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. దీనిపై ఇటీవల విచారణ పూర్తయింది. నేరం రుజువు కావడంతో ప్రస్తుతం డీఎస్పీ క్యాడర్ లో ఉన్న ఆయనను ఆర్ముడ్ కానిస్టేబుల్ గా డెమోట్ చేశారు. ఈ ఘటన వైరల్ అంశంగా మారింది. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.