Pawan Kalyan: రీ రిలీజ్ కి రెడీ గా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు…

2024 ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ ఇటు స్టేట్లోనూ, అటు సెంట్రల్లోను టిడిపి, బిజెపి పార్టీ లు గెలవడంలో ఆయన కీలక పాత్ర వహించాడు. ఇక పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు.

Written By: Gopi, Updated On : June 23, 2024 2:31 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” సినిమాతో తన ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ఆయన ప్రస్తుతం ‘ఓజీ ‘, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరిహర వీరమల్లు’ లాంటి సినిమాల వరకు తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే జనసేన అనే పార్టీని పెట్టి 10 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతాన్ని సృష్టించాడనే చెప్పాలి.

ఇక 2024 ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ ఇటు స్టేట్లోనూ, అటు సెంట్రల్లోను టిడిపి, బిజెపి పార్టీ లు గెలవడంలో ఆయన కీలక పాత్ర వహించాడు. ఇక పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఇక దాంతో పాటుగా పాన్ ఇండియా లెవెల్లో ఆయనకు భారీ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలు లేటవుతున్న సందర్భంగా ఆయన గతం లో చేసిన సినిమాలను రీ రిలీజ్ చేసి చూడడానికి అభిమానులు చాలావరకు ఉత్సాహన్ని చూపిస్తున్నారు.

ఇక అందులో భాగంగానే గత వారం ‘తమ్ముడు ‘ సినిమాని రీ రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ చేసిన అతని ఫ్యాన్స్ ఇప్పుడు మరోసారి రీ రిలీజ్ లా మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకు ముందే బద్రి సినిమాని రీ రిలీజ్ చేసినప్పటికీ ఇప్పుడు మరోసారి రీ రీ రిలీజ్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతోపాటుగా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’, ‘అజ్ఞాతవాసి ‘ లాంటి సినిమాలను చేయడానికి రీ రిలీజ్ చేసే ప్రయత్నాలైతే జరుగుతున్నాయి.

ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తన సినిమాల మీద ఫోకస్ పెట్టడానికి మరొక రెండు మూడు నెలలు సమయం పట్టే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పుడు పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఆయా శాఖల మీద కొంచెం ఫోకస్ పెట్టి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే వాటన్నింటిని పవన్ కళ్యాణ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. కాబట్టి వీటిని సెట్ చేసిన తర్వాత ఆయన సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తున్నారు…