
Pawan Kalyan – Sai Dharam Tej Movie పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులకు అన్నీ ఒక ప్యాకేజి లాగా ఉండాలి..ఏది మిస్ అయినా తట్టుకోలేరు, ముఖ్యంగా ఆయన స్టార్ స్టేటస్ కి మ్యాచ్ అయ్యేటట్టు ఎలివేషన్స్ మరియు ఫైట్స్ ఉండాల్సిందే.అవి లేకపోతే అసలు ఊరుకోరు, అయితే లేటెస్ట్ గా ఆయన సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది,నేటి తో పవన్ కళ్యాణ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందట.ఈ చిత్రం కోసం ఆయన 25 రోజులు కేటాయించాడు.ఈ 25 రోజులకు గాను ఆయన 50 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం.అంటే రోజుకి సగటున రెండు కోట్ల రూపాయిలు అన్నమాట.ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఇప్పటి వరకు ఎవరికీ ఇవ్వలేదు అనే చెప్పాలి.

అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తూ అభిమానులను కంగారు పెడుతుంది.అదేమిటి అంటే ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ అల్ట్రా స్టైలిష్ లుక్స్ మరియు ఫుల్ ఎనెర్జిటిక్ యాక్టింగ్ తో కనిపిస్తాడు కానీ, ఆయనకి సంబంధించి పాటలు కానీ ఫైట్స్ కానీ ఉండవట.ఇదే ఇప్పుడు అభిమానులను కంగారు పెడుతున్న విషయం.
పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ కి ఇలాంటివి లేకపోతే అభిమానులు ఎలా తీసుకోగలరు, సినిమా ఫ్లాప్ అవుతుందని భయపడుతున్నారు.అయితే అలాంటి భయాలు ఏమి పెట్టుకోవద్దు అని, ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ కి ఫైట్స్ ఉంటాయి అని , అలాగే అల్లుడితో కలిసి ఒక పాట కూడా ఉంటుందని,ఈ పాటలో శ్రీలీల కూడా కనిపిస్తుందని కొన్ని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.మరి వీటిల్లో ఏది నిజమో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.