Jagityala District: ఒక్క టిక్కెట్ ఎంత పనిచేసింది.. చిల్లర కోసం ఆర్టీసీ బస్సులో గొడవ… 2 కి.మీ నడిచేలా చేసింది.

జగిత్యాల జిల్లాలో అంబారీ పేట గ్రామం నుంచి వెల్గటూర్ వెళ్లడానికి ఓ ప్రయాణికుడు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఈ రెండు గ్రామాల మధ్య చార్జీ రూ.20. అయితే ఓ ప్రయాణికుడు బస్సు ఎక్కన తరువాత కండక్టర్ వచ్చాడు.

Written By: Srinivas, Updated On : May 4, 2023 3:05 pm
Follow us on

Jagityala District: ఆర్టీసీ బస్ ఎక్కగానే మనకు ముందుగా బస్ డోర్లపై ‘టిక్కెట్టుకు సరిపడా చిల్లర ఇవ్వండి’ అని రాస్తారు. దీనిని చూసిన కొంతమంది ఆమాత్రం చిల్లర దొరకడం లేదా? అనే డౌట్ వస్తుంది. కానీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులు, కండక్టర్ చిల్లరతో పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. సరిపడా చిల్లర లేకపోతే ఒక్కోసారి వందల రూపాయలు కోల్పోవాల్సి వస్తుంది. అయితే జగిత్యాల జిల్లాలో చిల్లర సమస్యలతో ఓ వ్యక్తి 2 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. చిల్లర విషయంలో కండక్టర్, ప్రయాణికుడి మధ్య జరిగిన వాగ్వాదంతో ఆ ప్రయాణికుడు ఎదుర్కొన్న ఇబ్బబందులతో ఇలా జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

జగిత్యాల జిల్లాలో అంబారీ పేట గ్రామం నుంచి వెల్గటూర్ వెళ్లడానికి ఓ ప్రయాణికుడు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఈ రెండు గ్రామాల మధ్య చార్జీ రూ.20. అయితే ఓ ప్రయాణికుడు బస్సు ఎక్కన తరువాత కండక్టర్ వచ్చాడు. టికెట్ తీసుకొమ్మని అడగగా… తన దగ్గరున్న రూ.200 నోటును ఇచ్చాడు. అయితే ఎప్పటిలాగే కండక్టర్ రూ.180 ని టికెట్ వెనకాల రాశాడు. ప్రయాణికుడి గమ్యం వచ్చే సమయానికి తన జేబులో టికెట్ కనిపించలేదు.

దీంతో ఆ ప్రయాణికుడు కండక్టర్ వద్దకు వెళ్లి తన రూ.180 ఇవ్వాలని అడిగాడు. కానీ టికెట్ ఇస్తేనే డబ్బులు ఇస్తానన్నాడు. తన దగ్గర టికెట్ లేదని, పోయిందని అన్నాడు. కండక్టర్ అస్సలు వినలేదు.చివరికి ఆ ప్రయాణికుడు తోటి ప్రయానికుడి వద్ద రూ.20 తీసుకొని కండక్టర్ కు ఇచ్చి తాను ఇచ్చిన రూ.200 ఇవ్వాలని అన్నాడు. అయినా కండక్టర్ ససెమిరా అనడంతో ఆ ప్రయాణికుడు బస్సులోనే ఉండిపోయాడు. తన టికెట్ కోసం బస్సులో వెతికాడు. చివరికి ఆ టికెట్ తన జేబులోనే కనిపించింది. అయితే ఇంతలో బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లింది. అప్పుడు టికెట్ ఇచ్చి తన డబ్బును తీసుకున్నాడు. దీంతో ఆ ప్రయాణికుడు తిరిగి 2 కిలోమీటర్ల నడవాల్సి వచ్చింది.

ఆర్టీసీ బస్సు ఎక్కేటప్పుడు చిల్లర లేకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో తెలియడానికి ఈ సంఘటనే నిదర్శనమని కొందరు అంటున్నారు. బస్సు ఎక్కేటప్పుడ సరైన చిల్లర ఉంచుకోవాలని సలహాలు ఇస్తున్నారు. కొందరు ప్రయాణికులు టికెట్ చార్జి కంటే ఎక్కువ డబ్బులు ఇస్తే మిగతా మొత్తాన్ని కండక్టర్ టికెట్ వెనకాల రాస్తారు. అలాంటివి ప్రయాణికులు చాలా వరకు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అందువల్ల చిల్లరను ముందే ఉంచుకొని బస్సు ఎక్కితే మంచిదని అంటున్నారు.