https://oktelugu.com/

Virupaksha Collections: మెగాస్టార్ ‘గాడ్ ఫాథర్’ కలెక్షన్స్ ని దాటేసిన ‘విరూపాక్ష’ చిత్రం.. 2 వారాల్లో వచ్చిన వసూళ్లు ఎంత అంటే..!

కంటెంట్ బలంగా ఉండడం వల్ల ఇతర బాషలలో కూడా ఇదే రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు.ట్రైలర్ కి హిందీ, తమిళ్ బాషలలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ కచ్చితంగా ఈ చిత్రం 'కాంతారా' తరహా లో ఇతర బాషలలో కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : May 4, 2023 / 12:59 PM IST
    Follow us on

    Virupaksha Collections: సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విరూపాక్ష’ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా రోజుకో సరికొత్త బెంచ్ మార్క్ ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది.తెలుగు లో ఈ స్థాయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రం రేపు కన్నడ బాష మినహా మిగిలిన అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదల కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రొమోషన్స్ కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు.

    కంటెంట్ బలంగా ఉండడం వల్ల ఇతర బాషలలో కూడా ఇదే రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు.ట్రైలర్ కి హిందీ, తమిళ్ బాషలలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ కచ్చితంగా ఈ చిత్రం ‘కాంతారా’ తరహా లో ఇతర బాషలలో కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు.

    ఇది ఇలా ఉండగా ఈ సినిమా మెగా స్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం వసూళ్లను చాలా ప్రాంతాలలో దాటేసింది. ఉదాహరణకి నైజాం ప్రాంతం లో గాడ్ ఫాదర్ చిత్రం 14 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేస్తే, ‘విరూపాక్ష’ చిత్రం కేవలం రెండు వారాల్లోనే 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఫుల్ రన్ లో ఈ సినిమా ఇక్కడ 20 కోట్ల రూపాయిల షేర్ ని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.

    ఇక గాడ్ ఫాదర్ కి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్లోసింగ్ కలెక్షన్స్ దాదాపుగా 60 కోట్ల రూపాయిల వరకు వచ్చింది. ‘విరూపాక్ష’ చిత్రం ఇతర బాషలలో కూడా విజయం సాధిస్తే, కచ్చితంగా గాడ్ ఫాదర్ క్లోసింగ్ కలెక్షన్స్ ని దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో ఇది కలలో కూడా ఊహించని రేర్ ఫీట్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు విరూపాక్ష చిత్రం రెండు వారాలకు గాను 42 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది. ఫుల్ రన్ లో ఎంత దూరం వెళ్లి ఆగుతుందో చూడాలి.