Samantha- Preetham Jukalker: సమంత ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ తో అందరికీ షాక్ ఇస్తుంది. ఆమె ఎవరేమనుకున్నా నాకు నచ్చినట్లు బ్రతికేస్తా అంటున్నారు. సమంత విడాకుల సందర్భంలో ప్రముఖంగా వినిపించిన వ్యక్తి ప్రీతమ్ జుకల్కర్ తో ఆమె స్నేహం కొనసాగుతుంది. 2021 అక్టోబర్ లో సమంత-నాగ చైతన్య విడాకులు ప్రకటించారు. వారు విడిపోవడం వెనుక కారణాల్లో ఒకటిగా ప్రీతమ్ జుకల్కర్ పేరు చెప్పుకున్నారు. సమంత పర్సనల్ డిజైనర్, స్టైలిస్ట్ అయిన ప్రీతమ్ తో సన్నిహితంగా ఉంటున్నారని, అది నచ్చని నాగ చైతన్య విడాకులు ఇచ్చారని ప్రచారం జరిగింది.
దీంతో ఆగ్రహానికి గురైన అక్కినేని ఫ్యాన్స్ … ప్రీతమ్ పై సోషల్ మీడియా దాడులు చేశారు. అతన్ని ట్రోల్ చేయడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ప్రీతమ్ స్వయంగా వివరణ ఇచ్చారు. సమంతను నేను అక్కగా భావిస్తాను. మా మధ్య ఉన్న రిలేషన్ ఎలాంటిదో చైతన్యకు కూడా తెలుసు. అనవసర రాద్ధాంతం చెయ్యొద్దని చెప్పుకొచ్చాడు. తర్వాత అతడు గే… సమంతతో అఫైర్ పెట్టుకొనే ఛాన్స్ లేదన్న వాదన కూడా తెరపైకి వచ్చింది.
Also Read: Pawan kalyan- Rajamouli: పవన్ తో రాజమౌళి మూవీ? కథ సిద్ధం చేస్తున్న విజయేంద్రప్రసాద్!
ఇంత రచ్చ జరిగిన నేపథ్యంలో సమంత అతన్ని దూరం పెడుతుందని అందరూ భావించారు. కానీ ఆమె మరింతగా అతడికి దగ్గరయ్యారు. సమంతకు అత్యంత ప్రియమైన వ్యక్తిగా ప్రీతమ్ మారాడు. విందులు, వినోదాలు, విహారాలు అతనితో చేస్తున్నారు. తాజాగా డేట్ నైట్ అంటూ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ప్రీతమ్ తో దిగిన ఫోటో షేర్ చేసింది సమంత. వీరిద్దరితో పాటు సాధన సింగ్ అనే అమ్మాయి కూడా ఉన్నారు. ఆమె కూడా సమంత వద్ద పనిచేస్తున్నారు. ఇక ప్రీతమ్ తో దిగిన ఆ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది.
ఈ వ్యవహారమంతా గమనిస్తున్నవారు ఎన్ని విమర్శలు వచ్చినా సమంత అతడిని వదలడం లేదంటున్నారు. సమంత సినిమాలకు కూడా ప్రీతమ్ నే డిజైనర్ గా పనిచేస్తున్నారు. కాతువాకుల రెండు కాదల్ చిత్రానికి ప్రీతమ్ డిజైనర్ గా వ్యవహరించారు. మరోవైపు సమంత చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. యశోద, ఖుషి సెట్స్ పై ఉన్నాయి. శాకుంతలం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఖుషి మూవీలో హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో పూర్తి చేశారు.
Also Read:Silk Smitha: సిల్క్ స్మిత కొరికిన సగం యాపిల్ అప్పట్లో ఎన్ని కోట్ల రూపాయిలకు కొన్నారో తెలుసా..?