https://oktelugu.com/

Keerthy Suresh- Anirudh: కీర్తిసురేష్, అనిరుధ్ పెళ్లి… అసలేం జరిగిందంటే?

కీర్తి సురేష్ బాలనటిగానే సినీ ఫీల్డులోకి ఎంట్రీ ఇచ్చింది. 2000 సంవత్సరంలో ‘పైలట్స్’ అనే సినిమాలో బాలనటిగా కనిపించింది. ఆ తరువాత ‘కుబేరన్’లో అలరించింది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 17, 2023 / 01:39 PM IST

    Keerthy Suresh- Anirudh

    Follow us on

    Keerthy Suresh- Anirudh: సినిమా నటులకు సంబంధించిన కొన్ని విషయాలు ఆసక్తి రేపుతుంటాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల పర్సనల్ విషయాలపై ఆడియన్స్ ఎక్కువగా దృష్టిపెడుతూ ఉంటారు. చాలా మంది నటులు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో కొందరు ఇతరులతో సన్నిహితంగా ఉండడంతో వారి మధ్య ఏదో ఉందని ప్రచారం చేస్తారు. ఫలితంగా వారి మధ్య ఎలాంటి బంధం లేకున్నా ఆలోచించాల్సి వస్తుంది. ఆలా ఆలోచించి ప్రేమలో పడిన వారు చాలా మందే ఉన్నారు. తాజగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ భామ ఇటీవల ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరు పెళ్లి చేసుకుంటున్నారని ప్రచారం చేశారు. ఈ ప్రచారంపై కీర్తిసురేష్, ఆమె తండ్రి రియక్షన్ ఎలా ఉందంటే?

    కీర్తి సురేష్ బాలనటిగానే సినీ ఫీల్డులోకి ఎంట్రీ ఇచ్చింది. 2000 సంవత్సరంలో ‘పైలట్స్’ అనే సినిమాలో బాలనటిగా కనిపించింది. ఆ తరువాత ‘కుబేరన్’లో అలరించింది. ఆ తరువాత చదువుపై ఫోకస్ పెట్టిన కీర్తి పెరిగి పెద్దయ్యాక ఫ్యాషన్ డిజైనర్ గా మారింది. అయితే తన తండ్రి సురేష్ కుమార్ సినీ నిర్మాత కావడంతో ఆమె కూడా సినిమా ఇండస్ట్రీలోకి రావాలని అనుకుంది. ఈ నేపథ్యంలో ‘గీతాంజలి’(మలయాళం) చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

    తెలుగులో రామ్ పోతినేనితో కలిసి ‘నేను శైలజ’ మూవీతో అలరించింది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించినా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ‘మహానటి’తో స్టార్ గుర్తింపు రావడమే కాకుండా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. రీసెంట్ గా తెలుగులోనే నానితో కలిసి ‘దసరా’ మూవీలో నట బీభత్సాన్ని సృష్టించింది. ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ కు పాన్ ఇండియా లెవల్లో ప్రశంసలు దక్కాయి. ఈ తరుణంలో ఆమెకు అన్ని వైపులా నుంచి అభినందనలు దక్కాయి.

    ఇటీవల కీర్తీ సురేస్ ‘జవాన్’ మూవీలోని ఓ సాంగ్ కు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది. ఈ తరుణంలో ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసని అనిరుద్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని పరోక్షంగా తెలిపింది. ఇదే సమయంలో అనిరుద్ తో కలిసి ఉన్న కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారన్న వార్తలు హల్ చల్ చేశారు. గతంలోనూ ఓ డైరెక్టర్ తో కీర్తి సురేష్ పెళ్లి జరుగుతుందని కొందరు ప్రచారం చేశారు.

    అయితే తాజాగా వచ్చిన వార్తలపై ముుందుగా కీర్తి సురేష్ తండ్రి స్పందించారు. అనిరుద్, కీర్తిసురేష్ పై వస్తున్న పెళ్లివార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇదంతా కావాలనే కొందరు ప్రచారం చేస్తున్నారన్నారు. అయితే వారిద్దరు మంచి స్నేహితులు అని చెప్పారు. అటు కీర్తి సురేష్ సైతం తాను ఇప్పుడే ఎవరినీ పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే కొందరు మాత్రం ముందు ఇలాగే చెప్పి ఆ తరువాత పెళ్లి చేసుకున్న వారు ఎందరో ఉన్నారని పోస్టులు పెడుతున్నారు. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి..