Viral Video: క్షవరం అయితే గాని వివరం అర్థం కాదు. ఈ సామెత ఎందుకు పుట్టిందో, ఎవరి వల్ల పుట్టిందో తెలియదు గాని.. పెళ్లయిన ప్రతి వారికి అనుభవంలోకి వస్తుంది. షాపింగ్ నుంచి మొదలుపెడితే కూరగాయలు కొనే వరకు.. ఇలా ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ కావడంవల్ల సగటు మగవాడికి ఫ్రస్టేషన్ పీక్స్ లోకి వెళ్తుంది భార్యను ఏమీ అనలేడు. అలాగని కోపాన్ని అనుచుకోలేడు. ఎక్కడో ఒకచోట బయటపడక తప్పదు. బయటపడిన తర్వాత సమాజం వేసే నిందలు వేరే విధంగా ఉంటాయి. అందుకే మనదేశంలో చాలామంది పెళ్లికి దూరంగా ఉండేందుకు అసలు కారణం ఇదే. చైనాలో కూడా ఇలాంటి ఒత్తిడి తట్టుకోలేక చాలామంది యువత పెళ్లిళ్ళు చేసుకోవడమే మానేశారు. దీంతో అక్కడ జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు ప్రకటించింది. పెళ్లి చేసుకునే యువతకు రకరకాల రాయితీలు ఇస్తామని చెప్పింది. అయినప్పటికీ అక్కడ యువత అంతా సుముఖంగా లేరు.
ఇక మన దేశానికి వచ్చేసరికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అని తేడా లేకుండా చాలామంది యువత పెళ్లిళ్లకు దూరంగా ఉంటున్నారు. ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉందని పైకి చెబుతున్నప్పటికీ.. ఒకప్పటిలాగా ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, వేరు కాపురాలు ఎక్కువ అవుతుండడం, భార్యాభర్తల మధ్య సఖ్యత సరిగా కుదరకపోవడం.. ఇలాంటి కారణాల వల్ల పెళ్లిళ్లు చేసుకునేందుకు యువత ముందుకు రావడం లేదు. దీనివల్ల బ్రహ్మచారులు పెరిగి.. అది దేశ జనాభా పెరుగుదల మీద పడుతోంది. ఇప్పటికి మన దేశం ప్రపంచంలో జనాభా సంఖ్యలో మొదటి స్థానంలో ఉండవచ్చు గాక.. భవిష్యత్తు రోజుల్లో ఆ స్థానం తగ్గిపోయే అవకాశం లేకపోలేదు. జనాభా తగ్గింది అంటే అది అంతర్లీనంగా అని రంగాల మీద ప్రభావం చూపిస్తుంది. ఈరోజు భారత్ నాలుగవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది అంటే, ప్రపంచ స్థాయి కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయంటే దానికి కారణం జనాభాలో మొదటి స్థానంలో ఉండటమే. కానీ ఆ జనాభా తగ్గిపోతే భారత్ అన్ని రంగాల్లో వెనుకంజ వేయాల్సి వస్తుంది.
ఇక బ్రహ్మచారుల బాధ ఈ విధంగా ఉంటే.. పెళ్లయిన వారి బాధ మరో విధంగా ఉంది. అక్షరాస్యత పెరగడం, ఆర్థిక స్థిరత్వం పెరగడం, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడంతో.. అవి అంతర్లీనంగా భార్యాభర్తల మీద ప్రభావం చూపిస్తున్నాయి.ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిరావడం అనివార్యంగా మారడంతో అంతరాలు క్రమంగా తొలగిపోతున్నాయి. ఇది మంచి పరిణామం అయినప్పటికీ భార్యాభర్తల మధ్య విభేదాలు పొడ చూపుతున్నాయి. పైగా ఈ వ్యవహారంలో భార్యల డామినేషన్ పెరిగిపోవడం మగవారిలో ఆత్మ న్యూనతకు దారితీస్తోంది.. ఒక సర్వే ప్రకారం పెళ్లయిన కొత్తలో బాగుంటున్న దంపతులు.. ఆ తర్వాత క్రమేపి గొడవలు పడుతున్నారు.. ఈ వ్యవహారంలో చివరికి భర్త ఒక మెట్టు కిందికి దిగాల్సి వస్తున్నది.” పొద్దున లేస్తూనే తనకు ఐ లవ్ యు చెప్పాలి.. ఏ పూటకు ఆ పుట్టే తన అందాన్ని పొగడాలి. ఏం చేసినా ఆ క్షణం భరించాలి తక్షణం. కత్తి మీద సామయింది కాపురం” అంటూ పెళ్లయిన మగవాళ్ళు పాడుకుంటున్నారు అంటే.. కాపురాలు ఎలా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. పెళ్లి చేసుకున్న కర్మానికి పరిస్థితి ఎలా ఉంటుందో ఓ నెటిజన్ ఓ వీడియో రూపంలో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. దీనిపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నప్పటికీ.. మెజారిటీ వర్గం మాత్రం పెళ్లంటే ఇలానే ఉంటుందని చెబుతుండడం విశేషం.
మాది కూడా సేమ్ ఫీలింగ్ pic.twitter.com/uWJcv9DPqe
— Suma Tiyyagura (Manvitha) (@SumaTiyyaguraa) September 6, 2023