Jaipur Couple: రూ.30కే కావాల్సినన్ని పూరీలు.. ఫుల్లుగా లాగించేసేయండి

Jaipur Couple: ఇప్పడున్న బిజీ లైఫ్ లో చాలా మందికి ఆహారాన్ని తయారు చేసుకునేంత సమయం ఉండడం లేదు. మహిళలు కూడా ఉద్యోగంతో పాటు వ్యాపారం చేస్తున్నందున ఇంట్లో పొయ్యి వెలిగించేవారు తక్కువవుతున్నారు. ఈ నేపథ్యంలో స్ట్రీట్ ఫుడ్ కు డిమాండ్ పెరుగుతుంది. చాలా మంది ఉద్యోగం చేసేవారు ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకోవడం కంటే హోటళ్లలోనే తింటున్నారు. కొందరు మధ్యాహ్నం భోజనం తీసుకెళ్తున్నా.. ఉదయం మాత్రం తప్పని సరిగా హోటళ్లలోనే బ్రేక్ ఫాస్ట్ కానిచ్చేస్తున్నారు. హోటళ్లు […]

Written By: Chai Muchhata, Updated On : April 20, 2023 12:22 pm
Follow us on

Jaipur Couple

Jaipur Couple: ఇప్పడున్న బిజీ లైఫ్ లో చాలా మందికి ఆహారాన్ని తయారు చేసుకునేంత సమయం ఉండడం లేదు. మహిళలు కూడా ఉద్యోగంతో పాటు వ్యాపారం చేస్తున్నందున ఇంట్లో పొయ్యి వెలిగించేవారు తక్కువవుతున్నారు. ఈ నేపథ్యంలో స్ట్రీట్ ఫుడ్ కు డిమాండ్ పెరుగుతుంది. చాలా మంది ఉద్యోగం చేసేవారు ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకోవడం కంటే హోటళ్లలోనే తింటున్నారు. కొందరు మధ్యాహ్నం భోజనం తీసుకెళ్తున్నా.. ఉదయం మాత్రం తప్పని సరిగా హోటళ్లలోనే బ్రేక్ ఫాస్ట్ కానిచ్చేస్తున్నారు.

హోటళ్లు టిఫిన్ చేసేవారితో రద్దీ పెరగడంతో వాటి ధరలు విపరీతంగా పెరిగాయి. రూ. 50 లేనిదే ప్లేట్ టిఫిన్ రావడం లేదు. దీంతో వచ్చే ఆదాయమంతా స్ట్రీట్ పుడ్ కే వెళ్తుందని ఆవేదన చెందుతున్నారు. అయితే రాజస్థాన్ జంట కేవలం రూ.30 కే కడుపునిండా టిఫిన్ ఇస్తున్నారు. ఏమాత్రం లాభా పేక్ష లేకుండా వీరందిస్తున్న టిఫిన్ తినేందుకు వినయోగదారులు క్యూ కడుతున్నారు. మరి ఆ ఫుడ్ విశేషాలేంటో తెలుసుకుందామా..

ఉదయం ఆఫీసులకు, వ్యాపార ప్రదేశాలకు వెళ్లేవారితో టిఫిన్ సెంటర్లు రద్దీగా మారుతున్నాయి. అయితే ఒక్కో ప్లేట్ ధర రూ.50 వసూలు చేస్తున్నారు. ఇంత మొత్తం తీసుకున్నా.. కొన్ని హోటళ్లలో రెండు పూరిలు మాత్రమే ఇస్తారు.. మరికొందరు నాలుగు వరకు వేస్తారు. ఇక స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలోనూ రూ.30 తీసుకున్నా నాలుగు పూరిల కంటే ఎక్కువ ఇవ్వరు. ఎక్స్ ట్రా కావాలంటే అధిక నగదును అడుగుతారు.

puris

అయితే రాజస్థాన్ కు చెందిన ఓ జంట ఆ రాష్ట్రంలోని జోధ్ పూర్ పట్టణంలో ఈ స్ట్రీట్ ఫుడ్ ను ఏర్పాటు చేశారు. వీరు అందరిలాగా కాకుండా వినూత్నంగా ఆలోచించారు. కస్టమర్ల కడుపు నింపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పది పూరీలను ఇచ్చి కేవలం రూ.30 మాత్రమే తీసుకుంటున్నారు. పోనీ చట్నీ ఇవ్వరా? అంటే అవసరానికంటే ఎక్కు ఇస్తారు. వీరు ఇచ్చే చట్నీలో సబ్జీ, జైడ్ డిస్ కింద టమోటా, వెల్లుల్ని చట్నీని కూడా సర్వ్ చేస్తారు. రైతా కావాలంటే మరో రూ.10 ఇవ్వాల్సి ఉంటుంది.

ఇంత తక్కువ ధరకే కడుపునిండా ఫుడ్ అందిస్తున్న వీరి దుకాణం ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు నడుస్తుంది. ఈ సెంటర్ ప్రారంభమైనప్పటి నుంచి మూసేదాకా రద్దీతోనే కనిపిస్తుంది. స్ట్రీట్ ఫుడ్ లవర్స్ ఈ విషయాన్ని తెలుసుకొని చాలా మంది ఇక్కడికి పరుగులుపెడుతున్నారు. ఇదిలా ఉండగా తక్కువ ధరకు టిఫిన్ అందిస్తున్న ఈ జంటను పలువురు అభినందిస్తున్నారు.

Tags