Whale: చిలీ(chili) లో పటగో నియాలో సముద్రం ఉంటుంది. ఇందులో విస్తారంగా చేపలు ఉంటాయి. ఈ చేపలను వేటాడేందుకు మత్స్యకారులు (fishermens) పడవల మీద వెళ్తుంటారు. చేపలను వేటాడి స్థానికంగా ఉన్న మార్కెట్లలో విక్రయిస్తుంటారు.. అయితే ఇదే ప్రాంతానికి చెందిన ఆడ్రియన్ సిమన్ కాన్(20) అనే యువకుడు తన తండ్రి డెల్ తో కలిసి వేర్వేరు పడవల్లో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. అయితే సముద్రం అల్లకల్లోలంగా ఉండడం.. అలలు అమాంతం దూసుకు రావడంతో..ఆడ్రియన్ సిమన్ కాన్ కాస్త ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ తన పడవను ముందుకు వెళ్ళనిచ్చాడు. చేపలను వేటాడేందుకు తన వంతు ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ఇంతలోనే ఆడ్రియన్ సిమన్ కాన్ కు హంప్ బ్యాక్ తిమింగలం ఎదురుపడింది.. అంతే ఒక్కసారి గా ఆడ్రియన్ సిమన్ కాన్ షాక్ కు గురయ్యాడు. ఏం జరుగుతుందో అర్థం కాక అలానే చూస్తుండిపోయాడు. అతిపెద్ద భారీ తిమింగలం ఆడ్రియన్ సిమన్ కాన్ పై దాడి చేయడానికి ప్రయత్నించింది. అంతేకాదు దాని అతిపెద్ద భారీ నోరు తెరిచి పడవను, ఆడ్రియన్ సిమన్ కాన్ ను నోట కరుచుకుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ వదిలిపెట్టింది. ఆడ్రియన్ సిమన్ కాన్ ను అనుసరిస్తున్న అతడి తండ్రి డెల్.. తన ఫోన్లో ఈ దృశ్యాలను చిత్రీకరించాడు. ఆ తర్వాత ఈ ఈ వీడియోను స్థానికంగా ఉన్న గ్రూప్లలో పోస్ట్ చేయగా.. అదికాస్త సంచలనంగా మారింది.
ఎందుకు వదిలిపెట్టిందంటే..
ఆడ్రియన్ సిమన్ కాన్ ప్రయాణిస్తున్న పడవ ప్లాస్టిక్, వుడ్, ఐరన్ సమ్మేళనంతో తయారుచేసింది. అది అత్యంత దృఢంగా ఉంటుంది. తన పంటికి అది కఠినంగా అనిపించడంతో తిమింగళం వెంటనే వదిలిపెట్టింది. లేకపోతే ఆడ్రియన్ సిమన్ కాన్ తిమింగలానికి పసందైన విందు అయ్యేవాడు. ఆ తిమింగళం సముద్రం అడుగుభాగం నుంచి ఒక్కసారిగా పైకి వచ్చింది. వేగంగా ఆడ్రియన్ సిమన్ కాన్ వైపు దూసుకు వచ్చింది. తినడానికి ప్రయత్నించింది. కాకపోతే ఆ పడవ దృఢంగా ఉండడంతో తిమింగలం నమల లేకపోయింది. అందువల్లే వదిలిపెట్టింది. ” నేను చేపల వేటలో ఉన్నా. సముద్రం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. అలలు మొత్తం దూసుకు వస్తున్నాయి. నేను ఉన్న చిన్నపాటి పడవ ద్వారా చేపల వేటను సాగించేందుకు ప్రయత్నిస్తున్నా. నా వెనుక నా తండ్రి ఉన్నారు. నన్నే అనుసరిస్తున్నారు. కానీ ఇంతలోనే ఓ భారీ తిమింగలం నా వైపు వచ్చింది. మొదట్లో నన్ను ఏమీ చేయదు అనుకున్నాను. కానీ పడవతో సహా నన్ను మింగడానికి ప్రయత్నించింది. కొంత దూరం అలా తీసుకెళ్ళింది. ఆ తర్వాత వదిలిపెట్టింది.. దీంతో నాకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. భూమ్మీద నూకలు ఉండడంతో నాకు పునర్జన్మ లభించినట్లయిందని” ఆడ్రియన్ సిమన్ కాన్ స్థానిక మీడియాతో వ్యాఖ్యానించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది..” అతడికి భూమ్మీద నూకలున్నాయి. లేకపోతే తిమింగలం మింగడం ఏంటి? కొంత దూరం తీసుకువెళ్లిన తర్వాత వదిలిపెట్టడం ఏంటి?” అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
సముద్రంలోకి చిన్న పడవలో వెళ్లిన ఓ యువకుడిని తిమింగలం నోట కరుచుకుంది.. ఆ తర్వాత వదిలేసింది.. చిలిలోని పటగోనియా తీర ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. #Whale#chili#Petagonia pic.twitter.com/CvFKECJHMl
— Anabothula Bhaskar (@AnabothulaB) February 15, 2025