Prateik Babbar
Prateik Babbar : బాలీవుడ్ స్టార్ హీరో ప్రతీక్ పాటిల్ బబ్బర్ మరోసారి ఓ ఇంటి వాడయ్యాడు. అతడు వాలంటైన్స్ డే సందర్భంగా తన ప్రియురాలు ప్రియా బెనర్జీని పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ పెళ్లికి ప్రతీక్ బబ్బర్ తన కుటుంబ సభ్యులను ఆహ్వానించలేదు. ఈ విషయం పై ప్రతీక బబ్బర్ సోదరుడు ఆర్య బబ్బర్ సంచలన ప్రకటన చేశారు. ఆర్య మాట్లాడుతూ..‘‘ ప్రతీక్ మా కుటుంబం నుంచి ఎవరినీ కూడా పెళ్లికి ఆహ్వానించలేదు.’’ అని చెప్పారు. ఇదే విషయం గురించి అతని చెల్లెలు జూహి బబ్బర్‌ను మీడియా ప్రశ్నించగా.. తాను ఆర్యను సమర్థించడం లేదు కానీ అతను కూడా అందరిలాగే బాధపడ్డాడు. ఎవరైనా గాయపడినప్పుడు వారికి మాట్లాడే హక్కు ఉంటుంది. ఇది సున్నితమైన అంశం.. ప్రతీక్ పుట్టక ముందు నుంచి అలాగే ఉంది. ప్రతీక్ నా సోదరుడు.. ప్రపంచంలో ఏదీ దీనిని మార్చలేదు. మనం ఒకే తండ్రి పిల్లలం అనే వాస్తవాన్ని కూడా అని చెప్పుకొచ్చింది.
ప్రతీక్ చుట్టూ ఉన్న కొంతమంది అతడిని తన కుటుంబం నుంచి దూరంగా ఉండాలని అడిగి ఉండవచ్చని జూహి భావించింది. జూహి మాట్లాడుతూ.. “ప్రస్తుతం ఆయన చుట్టూ కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆయనను ప్రభావితం చేసిన వారి పేర్లు ప్రస్తుతం అనవసరం. కానీ మేము వారిని మధ్యలోకి తీసుకురావాలనుకోవడం లేదు ఎందుకంటే అది ఉపయోగపడదు. ప్రియ చాలా మంచి అమ్మాయి, తనను ప్రేమించే, అర్థం చేసుకునే భాగస్వామి దొరకడం ఆమె అదృష్టం అని చెప్పుకొచ్చింది. తనను పెళ్లికి పిలవకపోయినా తన తమ్ముడి మీద కోపం లేదని పేర్కొంది. తన మొదటి పెళ్లి కారణంగా చాలా బాధను ప్రతీక్ అనుభవించాడని జూహి తెలిపింది. ఇప్పుడు రెండోసారి వివాహం చేసుకోవడం ద్వారా అతడికి సంతోషం లభించాలని కోరుకుంది. పెళ్లిళ్ల సమయంలో ప్రతి కుటుంబంలో చర్చలు జరుగుతాయి. మొదటి పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిపించామని పేర్కొంది. కానీ అలా జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇది ప్రతీక్ రెండవ పెళ్లి. అంతకుముందు, అతను సన్యా సాగర్‌ను వివాహం చేసుకున్నాడు. ప్రతీక్ ప్రముఖ నటులు రాజ్ బబ్బర్, స్మితా పాటిల్ ల కుమారుడు. ఆ సమయానికి రాజ్ అప్పటికే నాదిరా బబ్బర్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఆర్య, జూహి బబ్బర్. అయితే, అతను తన సహనటి స్మితతో ప్రేమలో పడి 1983 లో వివాహం చేసుకున్నారు. 1986 లో ప్రతీక్‌కు జన్మనిచ్చారు. దురదృష్టవశాత్తు, స్మిత ప్రసవించిన కొన్ని రోజులకే ప్రసవ సమస్యల కారణంగా మరణించింది. తన అకాల మరణం తరువాత రాజ్ నాదిరకు దగ్గరయ్యాడు.