https://oktelugu.com/

Lions: సింహాలంటే క్రూర జంతువులనుకుంటాం.. వాటికి కుక్కలను మించిన విశ్వాసం ఉంటుంది.. వీడియో వైరల్

ఆ మహిళ పేరు తెలియదు గాని.. ట్విట్టర్లో ఒక వీడియో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే అది మిలియన్ వ్యూస్ నమోదు చేసింది. ఇంకా ఆ వీడియోను నెటిజన్లు చూస్తూనే ఉన్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 30, 2024 / 09:24 AM IST

    Lions

    Follow us on

    Lions: సింహాలంటే.. గంభీరమైన చూపు.. తీక్షణమైన అడుగులు.. ఒక్క పంజా దెబ్బతో చంపేసే సత్తా.. పదునైన దంతాలతో ఎదుటి జంతువును చీల్చి చీల్చి తినగలిగేంత క్రూరత్వమే మనకు స్ఫురణకు వస్తుంది. అంతటి సింహాల్లోనూ విశ్వాసం ఉంటుంది. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.

    ఆ మహిళ పేరు తెలియదు గాని.. ట్విట్టర్లో ఒక వీడియో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే అది మిలియన్ వ్యూస్ నమోదు చేసింది. ఇంకా ఆ వీడియోను నెటిజన్లు చూస్తూనే ఉన్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ మహిళ చాలా కాలం తర్వాత తన వ్యవసాయ క్షేత్రానికి వస్తుంది. గేటు తీయగానే రెండు సింహాలు పోటీపడి పరుగులు తీసుకుంటూ ఆమె వద్దకు వస్తాయి. ఆ వీడియో చూస్తున్న ఎవరైనా ఆ సింహాలు కచ్చితంగా ఆమెను చంపితింటాయని అనుకుంటారు. కానీ అవి అలా చేయవు. నేరుగా ఆ మహిళ వద్దకు వచ్చి వాటి రెండు కాళ్ళను ఆమె భుజాల మీద పెడతాయి. ఆమెను ప్రేమగా ఆలింగనం చేసుకుంటాయి. ఆమె కూడా ఆ సింహాల నుదురును ప్రేమగా తడుముతుంది. కొంతసేపటి దాకా ఆ సింహాలు ఆమెతో సరదాగా ఆటలాడుకుంటాయి. వాస్తవానికి సింహాలను చూస్తే మనలో చాలామందికి భయం వేస్తుంది. ఎందుకంటే అది క్రూర జంతువులు కాబట్టి. పైగా సింహం చాలా బలిష్టమైనది కావడంతో.. ఎంతటి జంతువునైనా అది మట్టి కరిపించగలదు. ఆఫ్ట్రాల్ మనిషి ఎంత.

    అయితే ఆ వీడియోలో ఆ సింహాలతో ఆప్యాయంగా ఉన్న ఆ మహిళ.. గతంలో ఆ సింహాలు గాయాల బారిన పడితే ఆమె నిర్వహించే దేశంలో ప్రత్యేక అనుమతులు తీసుకొని తన వ్యవసాయ క్షేత్రంలో పెంచడం మొదలుపెట్టింది. గాయపడిన వాటికి సపర్యలు చేసింది. వాటి కోసం ప్రత్యేకంగా ఇంక్యుబేటర్లు కొనుగోలు చేసి కాపాడింది. స్వచ్ఛమైన పాలను వాటికి ఆహారంగా ఇచ్చింది. అయితే ఆమె సంరక్షణలో ఆ సింహాలు పెరగడం వల్ల వేటాడే లక్షణాన్ని కోల్పోయినట్టు తెలుస్తోంది. పైగా ఆ సింహాల కోసం ఆమె ప్రతిరోజు మాంసం వేస్తుంది. ఇలా ఆమె పెట్టే మాంసానికి అలవాటు పడిన ఆ సింహాలు వేటాడే సహజ లక్షణాన్ని మర్చిపోయాయి. అందువల్లే ఆ మహిళ మీదకు అలా వస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ మహిళతో ఆ సింహాలు అలా సన్నిహితంగా ఉండటం మాత్రం విపరీతంగా నచ్చింది. అలా రెండు సింహాలు పోటీపడి పరుగులు తీస్తున్నప్పటికీ ఆ మహిళ అక్కడే ధైర్యంగా నిలబడటం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. నేచర్ ఇస్ అమేజింగ్ అనే ట్విట్టర్ ఐడి ద్వారా ఈ వీడియోను పోస్ట్ చేశారు.