Leopard: కవలలు అంటే ఒకేలా ఉండాలా ఏంటి? కావాలంటే ఈ పులులను చూడండి..

మనదేశంలో ఒడిశా రాష్ట్రంలో విస్తారంగా అడవులు ఉంటాయి.. ఈ అడవుల్లో పులులు, సింహాలు జీవిస్తూ ఉంటాయి.. జింకలు, దుప్పులకు ఈ అడవుల్లో కొదవలేదు. పైగా ఒడిశా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిసారించడంతో అడవులలో జంతువుల సంఖ్య పెరుగుతున్నది.

Written By: Anabothula Bhaskar, Updated On : March 30, 2024 9:18 am

Leopard

Follow us on

Leopard: ఒక మహిళ గర్భం దాల్చినప్పుడు ఒకరికి మాత్రమే జన్మనిస్తుంది. జన్యువుల్లో మార్పులు, క్రోమోసోమ్ లలో మార్పుల వల్ల ఒక్కోసారి కవలలకు జన్మనిస్తుంది. అనూహ్య పరిస్థితుల్లో ఒక్కోసారి ముగ్గురికి కూడా జన్మనిస్తుంది. ఇలా జన్మించిన వారు చూసేందుకు ఒకేలాగా ఉంటారు. ఒకరికి ఒకరు పరస్పర విరుద్ధంగా అస్సలు ఉండరు. ఇక జంతువుల్లో కూడా ఇలానే ఉంటుంది. కాకపోతే కొన్ని జంతువులు తమకున్న ప్రత్యేక లక్షణాలు ఆధారంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంతానానికి జన్మనిస్తాయి.. సాధారణంగా ఈ సంతానంలో కొన్ని లక్షణాలు మినహా మిగతా రూపాల్లో ఆ జంతువులు ఒకే విధంగా ఉంటాయి. కానీ అరుదైన సందర్భాల్లో మాత్రమే కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. ప్రస్తుతం మీరు చదవబోయే కథనం కూడా అటువంటిదే.

మనదేశంలో ఒడిశా రాష్ట్రంలో విస్తారంగా అడవులు ఉంటాయి.. ఈ అడవుల్లో పులులు, సింహాలు జీవిస్తూ ఉంటాయి.. జింకలు, దుప్పులకు ఈ అడవుల్లో కొదవలేదు. పైగా ఒడిశా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిసారించడంతో అడవులలో జంతువుల సంఖ్య పెరుగుతున్నది. ముఖ్యంగా గత కొంతకాలంగా ఒడిశా రాష్ట్రంలోని అడవుల్లో పులుల సంఖ్య పెరుగుతుంది.. అయితే ఇటీవల అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలలో అద్భుతమైన దృశ్యాలు చిక్కాయి. దీంతో అటవీ శాఖ అధికారులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.

సాధారణంగా ఒక పులి రెండు లేదా మూడు పిల్లలకు జన్మనిస్తుంది. ఆ పులులు చూడడానికి కొన్ని కొన్ని మార్పులు మినహా ఒకే విధంగా కనిపిస్తుంటాయి. కానీ ఒడిశా రాష్ట్రంలో ఒక పులి రెండు విచిత్రమైన జంతువులకు జన్మనిచ్చింది. అందులో ఒక పులి పూర్తిగా నలుపు రంగుతో బ్లాక్ పాంథర్ లాగా కనిపిస్తోంది. మరో పులి సాధారణ ఆకృతితోనే దర్శనమిస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుసంతానంద ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. రెండు పులులు అడవిలో పక్కపక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాయి. అందులో ఒక పులి సాధారణంగా ఉండగా.. మరో పులి పూర్తి నలుపు రంగులో ఉంది. అయితే ఇలాంటి నలుపు రంగులో ఉన్న పులి ఇంతవరకు మనదేశంలో కనిపించలేదు. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలలో ఈ దృశ్యాలు చిక్కాయి. సాధారణ పులి కంటే బ్లాక్ పాంథర్ బలంగా కనిపిస్తోంది. దృఢమైన అడుగులు వేస్తోంది. చీకట్లోనూ ఉత్సాహంగా కనిపిస్తోంది. అయితే జంతువుల్లో అప్పుడప్పుడు జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటాయని.. అలాంటప్పుడు ఇలా పరస్పర విరుద్ధమైన రంగుల్లో జంతువులు పుడతాయని జంతు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

పులి గర్భం దాల్చినప్పుడు దాని అంతర్గత శరీరంలో ఏవైనా మార్పులు చోటు చేసుకోవడం లేదా జన్యు అమరికలో తేడా వల్ల ఇలా పరస్పర విరుద్ధమైన జంతువులు పుడతాయని జంతు వైద్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాగా, ఆ పులి చూడడానికి గంభీరంగా కనిపిస్తోంది. దాని అడుగులు చాలా బలంగా ఉన్నాయి. అర్ధరాత్రి పూట ట్రాప్ కెమెరాలలో దాని కళ్ళు మిరమిట్లు గొలుపుతున్నాయి. బ్లాక్ పాంథర్, సాధారణ పులి ఫోటోలను సుసంతానంద తన ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా అవి వైరల్ గా మారాయి.